COVID-19 in AP: కర్నూలులో కరోనా కల్లోలం, ఒక్కరోజే 26 కేసులు, ఏపీలో 252కు చేరిన కరోనా కేసులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాన మంత్రి మోదీ ఫోన్
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Amaravati, April 6: కరోనా మహమ్మారి విలయతాండవానికి ఇరు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.మొదట్లో ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు (COVID-19 in AP) అంతలా లేకున్నప్పటికీ నిజాముద్దీన్ ఘటన వల్ల ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు (AP Corona cases) ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో కొత్తగా మరో 26 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ

నిన్న కర్నూలు జిల్లాలోనే 26 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి.కర్నూలులో మొత్తం కేసులు 53కు చేరాయి. 252 కేసుల్లో ఢిల్లీ మర్కజ్‌ (Delhi Markaz) వెళ్లొచ్చిన 190 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెష్పల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు ఏపీలో 5 గురు డిశ్చార్జ్‌ అయినట్టు తెలిపారు.

వైద్యులు, సిబ్బందిపై దాడి చేస్తే అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి (AP CM YS jagan) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌తో మోదీ చర్చించారు. అంతకు ముందు ప్రధాని మోదీ వరుసగా పలువురు నేతలకు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులకు ఫోన్లు చేశారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలకు ఫోన్ చేసి కరోనా మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Here's AP Corona Cases List

కాగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఎవరు వచ్చినా చికిత్స అందించాలన్నారు. కరోనా నియంత్రణపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా కాటుకు కుల, మత భేదాలు లేవు

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవాళ్లు, వారు కలిసిన వ్యక్తులకు త్వరగా పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కరోనా టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పుడున్న ల్యాబ్ ల సామర్థ్యం పెంచాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆరోగ్య సర్వే నిరంతరం జరుగుతుండాలని ఆదేశించారు. కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలు పాటించేలా చూడాలని తెలిపారు. ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం మార్గదర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు

జిల్లాల వారీగా కరోనా కేసులు..

కర్నూలు-53

వైఎస్సార్‌- 23

అనంతపురం-3

చిత్తూరు-17

నెల్లూరు-34

గుంటూరు-30

ప్రకాశం- 23

పశ్చిమ గోదావరి-15

తూర్పు గోదావరి-11

కృష్ణా-28

విజయనగరం-0

విశాఖపట్నం-15

శ్రీకాకుళం-0