AP Medi-Tech Zone: కరోనా కట్టడిపై అలుపెరగని పోరు, ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ, విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్‌లో తయారీ పనులు, త్వరితగతిన పనులు ప్రారంభించాలని కోరిన కేంద్రం
COVID 19 Testing (Photo Credits: Pixabay)

Amaravati, April 5: ఏపీలో పంజా విప్పుతున్న కోవిడ్ 19 (COVID-19) మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలకమైన వెంటిలేటర్లు మరియు కోవిడ్ -19 టెస్టింగ్ కిట్‌లను (COVID-19 Testing Kits) ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ మెడి-టెక్ జోన్ (AMTZ) ను ఉపయోగించుకోనుంది.

కేంద్రం ఇప్పటికే 3,500 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూనిట్ల సమీకరణ ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతుందని ఆంధ్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు మరియు వాణిజ్య) రజత్ భార్గవ తెలిపారు.

రాత్రి 9 గంటల 9 నిమిషాలకు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని పిలుపు

విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్ (AP Medi-Tech Zone) ద్వారా కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఈ నెల మధ్యలో అందుబాటులోకి వస్తాయని సీనియర్ ఐఎఎస్ అదికారులు పూనం మాలకొండయ్య, రజత్ భార్గవ లు మీడియా సమావేశంలో తెలిపారు.కాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ జోన్ కు ప్రాదాన్యత ఇస్తున్నారని ఆమె అన్నారు. మెడ్‌టెక్ జోన్‌లో ప్రస్తుతం వైద్య పరికరాల ఉత్పత్తి జరుగుతోందన్నారు.

ప్రధాని మోదీ 9 నిమిషాల మెసేజ్ రహస్యం

పరికరాలను కూడా పరీక్ష చేసే 13 లాబ్స్ ఏర్పాటు చేశామని, కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఈనెల 10వ తేదీ నుంచి మార్కెట్లోకి వస్తాయన్నారు. దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మెడ్ టెక్ జోన్ మారబోతోందన్నారు. ప్రభుత్వ సహకారంతో మెడ్‌టెక్ జోన్ ఎండీ జితేందర్ శర్మ దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా

AMTZ ద్వారా ఏప్రిల్‌లో సరాసరి 3వేల వెంటిలేటర్లు తయారు చేయనున్నారని.. మే నెల నుంచి 6 వేల కిట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పాటు ఏప్రిల్‌ నెలలో 10 వేలు, మే నుంచి 25 వేల వరకు టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మెడ్‌టెక్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వాన్ని నిధులు అడిగినట్లు రజత్ భార్గవ్ తెలిపారు.

17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్‌ మత ప్రకంపనలు

కోవిడ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీకి ఆదేశాలు జారీ చేశామని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 15 నాటికి సరఫరా చేయాల్సిందిగా మెడ్ టెక్ పార్కు లో కొన్ని కంపెనీలను కోరాం. అక్కడ ఉత్పత్తి ని గాని, అభివృద్ధి ని గాని తగ్గించ లేదు.రెండో దశ లో 270 ఎకరాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసికి అప్పగించామన్నారు.

మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదు

AMTZ ఏప్రిల్‌లో 3,000 వెంటిలేటర్లను తయారుచేసే సామర్థ్యంతో ప్రారంభమవుతుందని, మే నుండి నెలకు 6,000 వరకు స్కేల్ చేస్తుందని భార్గవ చెప్పారు. హిందూస్తాన్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (హెచ్‌ఎల్‌ఎల్) ఈ వెంటిలేటర్ల అసెంబ్లీకి సహాయం చేస్తుంది. దీని కోసం అవసరమైన ప్లాంట్ మరియు యంత్రాలను విశాఖపట్నంకు తరలిస్తున్నారు.

ఏపీలో రెండో కరోనా మరణం

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ AMTZ వద్ద తయారు చేయవలసిన కిట్లను ఆమోదించగా, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటిలేటర్లకు అన్ని తయారీ ఆమోదాల నుండి మినహాయింపు ఇచ్చింది."భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ సహకారంతో, మేము దశ -1 లో ఆరు కంపెనీలను ఎన్నుకున్నాము. పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేర్చుకునేందుకు ఈ ప్రాజెక్టుకు మరింత ఆర్థిక సహాయం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది" అని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

AMTZ లోని పరికరాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల భవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ .30 కోట్లు, కేంద్రం రూ .8 కోట్లు విడుదల చేసింది. AMTZ ను వైద్య పరికరాల కోసం National Implementing Agencyగా మార్చాలని కోరుతూ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్.. ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) లేఖ రాశారు. దీనికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి అంగీకరించారు.

వైన్ షాపు పగులకొట్టి మద్యం లూటీకి పాల్పడిన దుండుగులు

కాగా "AMTZ విస్తరణకు 300 కోట్ల రూపాయల సహాయాన్ని అందించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు ముందుకు వచ్చింది. దీని ప్రకారం, త్వరలో 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు దశ -2 ను చేపట్టబోతున్నాం. సుమారు 177 కంపెనీలు తమ యూనిట్లను వివిధ తయారీకి ఏర్పాటు చేస్తాయని భార్గవ అన్నారు.