Coronavirus in India (Photo Credits: IANS)

Hyderabad, April 5: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా (COVID-19 in Telugu States) విసురుతోంది. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసులు సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఒక్కరోజులోనే అనూహ్యంగా కొత్త కేసులు పెరిగిపోయాయి.

17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్‌ మత ప్రకంపనలు

ఏపీలో పాజిటివ్ కేసులు (Corona positive Cases in AP) రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలో కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఏపీలో (Andhra pradesh) కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కి చేరింది. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు 23, ప్రకాశం 2, నెల్లూరు 2, చిత్తూరు జిల్లాలో 7 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

కరోనావైరస్‌కి వర్షాలు తోడు

నిన్న రాత్రి 9 నుంచి ఇప్పటి వరకు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. అలాగే ఇద్దరు వ్యక్తులు మరణించారు కర్నూలు జిల్లాలో ఒక్కరోజే 23 కొత్త కేసులు నమోదు కావటం గమనార్హం. దీంతో ఆ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది.

కరోనా కాటుకు కుల, మత భేదాలు లేవు

తెలంగాణలో ( Telangana) శనివారం 43 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 272కు (Corona positive Cases in Telagana) చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 33 మంది కోలుకున్నారని, ఇందులో పలువురు డిశ్చార్జి అయ్యారని, మొత్తంగా 11మంది చనిపోయారని వివరించింది. ప్రస్తుతం 228 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నది.

ఏపీలో రెండో కరోనా మరణం

కాగా రెండు రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో అధికభాగం మర్కజ్‌ వెళ్లి వచ్చిన యాత్రికులవేనని తెలుస్తోంది. మర్కజ్‌ నుంచి 1,090 మంది తెలంగాణకు వచ్చారని, వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మంత్రి తెలిపారు.