COVID-19 Delhi government to ask police to register FIR against Maulana of Nizamuddin Markaz (Photo-PTI)

New Delhi, April 05: గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్‌ మత ప్రార్థనలు (Tablighi Jamaat congregation) ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus positive cases), మరణాల మూలాలన్నీ మర్కజ్‌ నుంచే ఉన్నట్లు వైద్యాధికారులు భావిస్తున్నారు. మర్కజ్‌ మత ప్రార్థనలకు(Nizamuddin markaz) వెళ్లిన వారు 17 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు నివేదికను తయారు చేశారు.

మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా..

నిజాముద్దీన్ మర్కజ్‌కు సంబంధించి ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 1023 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ (Union health ministry) పేర్కొన్నారు. అలాగే మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన సుమారు 22వేల మందిని క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 30శాతానికిపైగా ఢిల్లీ వెళ్లొచ్చిన వారికి సంబంధించినవే అని కేంద్రం వెల్లడించింది.

ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు

ఢిల్లీ బాధిత రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉన్నట్లు తెలిపింది. కరోనా నిర్థారిత కేసుల్లో 30 శాతం వరకు ఒక ప్రాంతానికి సంబంధించినవే కాబట్టి, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

టూరిస్ట్ వీసాతో వచ్చి మతపరమైన ప్రచారం నిర్వహించిన విదేశీయులు

ఇక ఆదివారం నాటికి కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 3,374గా నమోదు కాగా, మృతుల సంఖ్య 77కు చేరుకుంది. ఈ వ్యాధి నుంచి 267 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.