Tablighi Jamaat Row: తబ్లిఘి జమాత్ యొక్క క్రియాశీల సభ్యుడు హైదరాబాద్‌లో మృతి. కరోనావైరస్ కారణంగానే మృతి చెందినట్లు అనుమానాలు, ఇప్పటికీ ధృవీకరించని రాష్ట్ర ఆరోగ్య శాఖ
COVID-19 Outbreak In Telangana | PTI Photo

Hyderabad, April 1:  దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ (Nizamuddin Markaz)  సమావేశానికి హాజరైన తబ్లిఘి జమాత్ (Tablighi Jamaat)  యొక్క క్రియాశీల సభ్యుడు (Active Member) హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. అయితే అతడి మరణానికి గల కారణాలపై ఇంతవరకు ఎలాంటి సమాచారం గానీ, అధికారిక ధృవీకరణ గానీ లేదు. అహ్మద్ అబ్దుల్ ముకీత్ అనే వ్యక్తి మంగళవారం మలక్ పేటలోని యశోద ఆసుపత్రిలో మరణించాడు. ఇతడి రక్త నమూనాలు ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారని, ఇతడి మరణానికి గల కారణాలు ఏంటి? కోవిడ్-19 తోనే చనిపోయాడా? లేదా ? అనే విషయాలను ఆరోగ్య శాఖనే ధృవీకరించాల్సి ఉంటుందని యశోధ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నట్లు IANS న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

కరోనావైరస్ లక్షణాలలో కీలకంగా చెప్పబడే న్యూమోనియా తరహా లక్షణాలతోనే అబ్దుల్ ముకీత్ యశోద ఆసుపత్రిలో చేరాడు, అతడి భార్య కూడా ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. వీరంతా మార్చి 15-17 మధ్య దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల తబ్లిఘి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన వారే.

Here's the update by IANS:

ఒకవేళ, తెలంగాణ ఆరోగ్య శాఖ ఇతడి మరణాన్ని ధృవీకరిస్తే, రాష్ట్రంలో COVID-19 తో మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంటుంది.  ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6 కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. ఈ ఆరుగురు కూడా తబ్లిఘి జమాత్ సమావేశానికి హాజరైన వారే.  మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా, మార్చి 23నే మర్కజ్ భవనం ఖాళీ చేయాలంటూ దిల్లీ పోలీసుల ఆదేశాలు

మొదటి మరణం గత శనివారం జరిగింది. మిగతా ఐదుగురి మరణం సోమవారం నాడు ప్రకటించారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో నలుగురు హైదరాబాద్‌ వారు కాగా, ఇద్దరు ఇద్దరు నిజామాబాద్ నుంచి, మరొకరు గద్వాల్‌ నుంచి ఉన్నారు.

దిల్లీలో ఇటీవల జరిగిన తబ్లిఘి జమాత్ సమావేశానికి తెలంగాణ నుంచి 1000-2000 వరకు హాజరైనట్లు అంచనా. ఈ కార్యక్రమానికి కరోనావైరస్ సోకిన విదేశీయులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇండియాలో కరోనావైరస్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ సమావేశంతో సంబంధమున్న వారి కోసం ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన 200 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. ఒక్క హైదరాబాద్‌లోనే 603 మందిని ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం, వీరిలో 374 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరిని ఐసోలేషన్ లో ఉంచారు, వీరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మిగతా వారి కోసం కూడా అధికారులు గాలిస్తున్నారు. దిల్లీ సమావేశానికి హాజరైన వారంరూ పరీక్షలు చేయించుకోవాలని, స్క్రీనింగ్ మరియు చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన విడుదల చేశారు.