Coronavirus Pandemic: గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ టీం

అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో (Novel Coronavirus Jumped From Bats To Humans) తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది

bat Representational Image (Photo Credits: Pxhere)

New Delhi, Mar 15: నోవల్ కరోనావైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో (Novel Coronavirus Jumped From Bats To Humans) తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ అధ్యయనాన్ని పీఎల్‌ఓఎస్‌ బయోలజీ జర్నల్‌ ప్రచురించింది.

PLOS బయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, SARS-CoV-2 వైరస్ యొక్క వందల వేల వరుస జన్యువులను అంచనా వేసింది. అలాగే COVID-19 మహమ్మారి యొక్క మొదటి 11 నెలల్లో చాలా 'ముఖ్యమైన జన్యు మార్పు' ఉందని కనుగొన్నారు.

డీ614జీ మ్యూటేషన్‌ వైరస్‌లోని మార్పులను (very Little Change) ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ మిగతా వైరస్‌ వలే సార్స్-కోవ్-2 వైరస్‌‌ కూడా కొన్ని మార్పులతో వ్యాపిస్తుందని స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త ఆస్కార్‌ మాక్లీన్‌ తెలిపారు. కానీ, ఈ వైరస్‌ వ్యాప్తి చెందే విధానంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదేమైనా, D614G మ్యుటేషన్ వంటి కొన్ని మార్పులు వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో ఇలాంటి ట్వీక్‌లు దాని జీవశాస్త్రాన్ని ప్రభావితం చేశాయని పేర్కొంది.

మళ్లీ డేంజర్ బెల్స్..నిన్న 25 వేలు కాగా నేడు 26 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో చేయి దాటుతున్న పరిస్థితి, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

సాధారణంగా వైరస్‌ (Novel Coronavirus) ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే క్రమంలో​ దాని లక్షణాలు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయని, సార్స్-కోవ్-2 వైరస్ కూడా అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని యూఎస్‌లోని టెంపుల్‌ యూనీవర్సీటి రచయిత సెర్గిపోండ్‌ తెలిపారు. సార్స్-కోవ్-2 వైరస్ మానవులకు సోకే సామర్థ్యం కలిగి ఉంటుందని, అయితే ఈ వైరస్‌ లక్షణాలు ముందుగా గబ్బిలాల్లో అభివృద్ధి చెందుతాయిని ఈ అధ్యయనంలో తెలిపారు.

ఇది ప్రధానంగా మానవునిలో రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. అయితే దేశంలో వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్‌లు అభివృద్ది చేసి ప్రజలకు అందించాలని గ్లాస్గో యూనివర్సీటి పరిశోధకుడు డేవిడ్‌ ఎల్‌ రాబర్గ్‌సస్‌ పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాక్సిన్లు వైరస్ ప్రసరణ అలాగే వేరియంట్‌లకు వ్యతిరేకంగా పని చేస్తూనే ఉంటాయి, అయితే ఎక్కువ సమయం గడిచేకొద్దీ, టీకాలు వేయబడిన మరియు టీకాలు వేయని వ్యక్తుల మధ్య పెద్ద వ్యత్యాసం ఉన్నందున, వ్యాక్సిన్ల నుండి తప్పించుకోవడానికి వైరస్‌కు ఎక్కువ అవకాశం ఉంటుందని వారు చెప్పారు.