Assam Shocker: కరోనాను జయించి ఇంటికి వెళుతున్న మహిళపై తెగబడిన కామాంధులు, తేయాకు తోటల్లోకి లాక్కెళ్లి అత్యాచారం, దుండగుల భారీ నుంచి తప్పించుకున్న బాధితురాలి కూతురు, అస్సాంలో దారుణ ఘటన

కరోనా నుంచి కోలుకుని ఇంటికి తిరిగివస్తున్న మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించి తేయాకు తోటలో అత్యాచారానికి (Coronavirus recovered Assam woman raped ) పాల్పడ్డారు.

Image used for representational purpose only | (Photo Credits: ANI)

Dispur, June 1: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా నుంచి కోలుకుని ఇంటికి తిరిగివస్తున్న మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించి తేయాకు తోటలో అత్యాచారానికి (Coronavirus recovered Assam woman raped ) పాల్పడ్డారు. ఆ దుండగుల బారి నుంచి ఆమె కుమార్తె తప్పించుకుంది. తాజాగా ఆ ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చారడియో జిల్లాకు చెందని తల్లి (54)తో పాటు కూతురి (17)కి కరోనా సోకింది. సపేకాతి మోడల్‌ ఆస్పత్రిలో ఇద్దరూ చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకోవడంతో మే 29వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని డాక్టర్లు సూచించారు. అయితే ఆసుపత్రి నుంచి తమ గ్రామం 25 కిలో మీటర్ల దూరం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో కర్ఫ్యూ కారణంగా ఇంటికి వెళ్లడం ఇబ్బంది అవుతుందని వారు భావించారు. దయచేసి తమను అంబులెన్స్​లో ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా ఆసుపత్రి వర్గాలను కోరారు. అయినా సరే వారికి అంబులెన్స్​ ఏర్పాటు చేసేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక వారు కాలిబాటన ఇంటికి (returning home) బయలుదేరారు.

నరసారావు పేటలో యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై నగ్న వీడియోలతో బెదిరింపులు, నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన టూటౌన్‌ సీఐ కృష్ణయ్య

ఇంటికి వెళ్తుండగా చీకటి పడటంతో మార్గమధ్యలో బొర్హట్‌ టీ ఎస్టేట్‌ సమీపంలో ఇద్దరు దుండగులు వచ్చారు. తల్లికూతురిని వెంబడించారు. యుక్త వయసు ఉన్న కూతురు వారి నుంచి తప్పించుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో నీరసంగా ఉండడంతో ఆ తల్లి వారికి చిక్కింది. వారు ఆమెపై తేయాకు తోటల సమీపంలో అత్యాచారానికి ఒడిగట్టారు. కూతురు పరిగెత్తుకుంటూ వెళ్లిన కుమార్తె సమీప గ్రామస్తులకు విషయం తెలిపింది. దీంతో ఆ గ్రామస్తులు తల్లి కోసం గాలించారు అయితే దుండగులు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె ఓ పొదల చాటున నిస్సహాయంగా పడింది. వెంటనే గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వృద్ధురాలిని చంపేసి ఆపై శవంతో అత్యాచారం, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, జువైనల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపిన డీఎస్పీ ప్రసాద్‌

అయితే అంబులెన్స్‌ఏర్పాటు చేయకపోవడంతోనే ఆమెపై అఘాయిత్యం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి కేశబ్‌ మహంత ‘నెగటివ్‌ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి ఇంటి వద్ద చేర్చేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు.

పెళ్లి చేసుకుంటానంటూ మహిళా డాక్టర్‌పై అదేపనిగా అత్యాచారం, తరువాత అశ్లీల ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులు, నాగ్‌పూర్‌లో ఐటీ కమిషనర్‌ దారుణం, ఐపీసీ సెక్షన్‌ 376 (2) కింద నిందితుడిపై కేసు నమోదు

ఘటనపై అసోం టీ ట్రైబ్ అసోసియేషన్ స్టూడెంట్స్ లీడర్​ మాట్లాడుతూ "ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణమైన సంఘటన జరిగింది. ఆసుపత్రి అంబులెన్స్ ఇస్తే ఇది జరిగేది కాదు. వారు ఇంటికి చేరుకోవడానికి దాదాపు 25 కిలోమీటర్లు నడవవలసి వచ్చింది. నిందితులతో పాటు ఆసుపత్రిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్​ చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif