Coronavirus in India: మాస్కుల దెబ్బ.. దేశంలో భారీగా తగ్గిన స్వైన్ ఫ్లూ కేసులు, భారత్‌లో తాజాగా 1059 మంది కరోనాతో మృతి, గత 24 గంటల్లో 67,151మందికి కోవిడ్-19, 32,34,475కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

గడిచిన 24 గంటల్లో 1059 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 59,449 కు (Coronavirus Deaths in India) చేరింది. వైరస్‌బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,07,267 యాక్టివ్‌ (Corona Active Cases) కేసులున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. నిన్న ఒక్క‌రోజే 8,23,992 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నామండ‌లి వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 25 వ‌ర‌కు మొత్తం 3,76,51,512 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, August 26: దేశంలో కొత్తగా 67,151 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,475కు (Coronavirus Cases in India) చేరింది. గడిచిన 24 గంటల్లో 1059 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 59,449 కు (Coronavirus Deaths in India) చేరింది. వైరస్‌బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,07,267 యాక్టివ్‌ (Corona Active Cases) కేసులున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. నిన్న ఒక్క‌రోజే 8,23,992 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నామండ‌లి వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 25 వ‌ర‌కు మొత్తం 3,76,51,512 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఢిల్లీలో (Delhi Covid 19) కొత్తగా 1,544 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం క‌రోనా బాధితుల‌ సంఖ్య ఒక లక్షా 64 వేలు దాటింది. 11 వేల 998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడ‌చిన‌ 24 గంటల్లో 1,155 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఒక ల‌క్షా 47 వేల 743 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా కార‌ణంగా 4,330 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో ఇప్పటివరకు 32 లక్షలకు పైగా కరోనా కేసులు న‌మోద‌య్యాయి. పిల్లలకు, టీనేజర్లకు కరోనా ముప్పు ఎక్కువ

59 వేల మందికి పైగా మృతిచెందారు. 24 లక్షలకు పైగా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈ నేప‌ధ్యంలో సీఎం కేజ్రీవాల్ క‌రోనా క‌ట్ట‌డి గురించి చ‌ర్చించేందుకు ఈరోజు అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ‌ మంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. డికె శివకుమార్‌కు కరోనా, తనను కలిసిన వారు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచన, ఆస్పత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు

ఈశాన్య రాష్ట్రం అసోంలో (Assam Covid 19) గడిచిన 24 గంటల్లో 1,973 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ 24 గంటల్లో 34,307 టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 94,592కు పెరిగిందని వివరించింది. ఇందులో 21,239 క్రియాశీల కేసులున్నట్లు తెలిపింది. కాగా, కొవిడ్‌తో కోలుకుని 73,090 మంది డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొంది. 260 మంది మరణించినట్లు వివరించింది.

దేశంలో కరోనా సమయంలో స్వైన్ ఫ్లూ(H1N1) కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధీనంలోని జాతీయ అంటువ్యాధుల నిరోధక కేంద్రం వెల్లడించింది. కరోనా సోకకుండా ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటిస్తుండటం వల్ల స్వైన్ ఫ్లూ (Swine Flu) మహమ్మారి ప్రభావం తగ్గిందని వైద్యులు చెప్పారు. గత ఏడాది దేశంలో 28,798 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది వీటి సంఖ్య 2,721కి తగ్గింది. గత ఏడాది స్వైన్ ఫ్లూ ప్రభావం వల్ల 1218 మంది మరణించగా, ఈ ఏడాది మృతుల సంఖ్య 44కు తగ్గింది.  మెదంత ఆస్పత్రికి హర్యానా సీఎం, కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ఆరోగ్య పరిస్థితి విషమం, కోమాలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

2017లో 38,811 మందికి స్వైన్ ఫ్లూ సోకగా, 2270 మంది మరణించారు. 2016లో స్వైన్ ఫ్లూ వల్ల 263 మంది మరణించారు. ఈ ఏడాది చలికాలంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరగవచ్చని వైద్యనిపుణులు చెపుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించడం వల్ల స్వైన్ ఫ్లూ తగ్గిందని వైద్యులు చెప్పారు. స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య కర్ణాటకలో అత్యధికంగా 458 నమోదైనాయి. తెలంగాణాలో 443 మందికి స్వైన్ ఫ్లూ సోకగా, వారిలో ఐదుగురు మరణించారు.