Covid in India: ముంబైలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, దేశంలో తాజాగా 9,121 మందికి కరోనా నిర్ధారణ, ఏపీలో 30 మందికి పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదు
అదే సమయంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది.
New Delhi, Feb 16: దేశంలో గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,33,025 మంది కోలుకున్నారు. 1,36,872 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 87,20,822 మందికి వ్యాక్సిన్ వేశారు.
తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 161 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,802కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,540 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,619 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,643 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 637 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,834 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 30 మందికి పాజిటివ్ గా (AP Coronavirus) నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల చనిపోయారు. 69 మంది కరోనా నుంచి కోలుకున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,88,899కి పెరిగింది. 8,81,041 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,163 మంది కరోనా వల్ల మృతి చెందారు.
మహారాష్ట్ర రాజధానిలోని ముంబై, పూణే, నగరాలతోపాటు విదర్భ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజే 400 కరోనా కేసులు (Maharashtra Coronavirus) వెలుగుచూశాయి. ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 3,14,569కి చేరింది. ప్రస్తుతం 5,531 మంది కరోనా రోగులున్నారు. ముంబై నగరంలో కరోనా ప్రబలిన ప్రాంతాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించారు. ముంబై నగరంలోని బోరివలి ప్రాంతంలో అత్యధికంగా 408 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనాతో బోరివలిలో 643 మంది మరణించారు.అంధేరి వెస్ట్, జోగేశ్వరి వెస్ట్, విలే పార్లే, ప్రాంతాల్లో378 కరోనా కేసులు నమోదైనాయి. 573 మంది కరోనాతో మరణించడంతో ఈ ప్రాంతంలో కరోనా నిరోధానికి 100 భవనాలకు అధికారులు సీలు వేశారు.
కాండీవలి, చార్ కోప్ ప్రాంతాల్లో 345 కరోనా కేసులు నమోదు కాగా 552 మంది మరణించారు. మలాద్, మనోరి, మార్వీ, అక్సా, మధ్ ప్రాంతాల్లో కరోనా కలవరం సృష్టిస్తోంది. ములుంద్ ప్రాంతంలో 202 భవనాలు, ఘట్ కోపర్, విద్యావిహార్, పంత్ నగర్ ప్రాంతాల్లో 162 భవనాలకు మున్సిపల్ అధికారులు సీలు వేశారు. 14 మురికివాడలను కంటైన్మెంటు జోన్లుగా ప్రకటించారు.భాండప్, పొవాయ్, కంజూర్ మార్గ్, విఖ్రోలి, నహూర్, ప్రాంతాల్లో 10 మురికివాడలను కంటైన్మెంటు జోన్లుగా ప్రకటించి కరోనా నిరోధానికి చర్యలు చేపట్టారు. ముంబై నగరంలో 85 కంటైన్మెంటు జోన్లుగా ప్రకటించి కరోనా హాట్ స్పాట్లు అయిన 992 భవనాలకు సీలు వేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.