IPL Auction 2025 Live

COVID-19 Alert: కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు మేలంటున్న డాక్టర్లు

జాగ్రత్తగా లేకుంటే అది మన ప్రాణాలనే హరించి వేయవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని మన నుండి తరిమేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు (COVID 19 Virus Alert) పాటించడం మంచిదంటున్నారు డాక్టర్లు. కరోనా వైరస్‌ (COVID-19) వ్యాప్తి, లక్షణాలు (COVID-19 Symptoms) , నివారణ చర్యలపై ప్రత్యేక కథనం ఇస్తున్నాం.

COVID-19 Alert: What are they and how to protect yourself | (Photo Credits: IANS)

New Delhi,Mar 05: ఇప్పుడు ప్రపంచాన్ని కరోనావైరస్ (Coronavirus) పట్టి పీడిస్తోంది. జాగ్రత్తగా లేకుంటే అది మన ప్రాణాలనే హరించి వేయవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని మన నుండి తరిమేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు (COVID 19 Virus Alert) పాటించడం మంచిదంటున్నారు డాక్టర్లు. కరోనా వైరస్‌ (COVID-19) వ్యాప్తి, లక్షణాలు (COVID-19 Symptoms) , నివారణ చర్యలపై ప్రత్యేక కథనం ఇస్తున్నాం.

కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ - మహేంద్రాహిల్స్ కాలనీలో స్కూళ్లకు సెలవులు

వ్యాధి వ్యాప్తి : పక్షులు, క్షీరదాలు, గబ్బిలాలు, పాములు, పెంపుడు జంతువుల నుంచి వస్తుంది. వ్యాధి సోకినా వ్యక్తి దగ్గినా, తుమ్మినా గాలి ద్వారా నోటి తుంపర్ల బయటకు వచ్చి, మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.

లక్షణాలు: జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం, గొంతు గరగర, ఛాతిలో నొప్పి, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.

వ్యాధి నివారణకు జాగ్రత్తలు: దగ్గు, తుమ్ములు, జలుబు తదితర లక్షణాలున్నవారికి దూరంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉంటే, వెంటనే మాస్కు ధరించి, ప్రభుత్సాస్పత్రికి వెళ్లి వైద్యులకు సంప్రదించాలి. తుమ్ములు, దగ్గు వచ్చిన్నప్పుడు చేతి రుమా లు అడ్డం పెట్టుకోవాలి. చేతులను తరుచు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

దేశంలో 28 కరోనా కేసులు నమోదు

చలిప్రదేశంలో తిరగకుండా ఉండాలి. విదేశాల నుంచి వచ్చిన వారు వైరస్‌ లక్షణాలున్నా లేకపోయిన కచ్చితంగా 28 రోజులపాటు వైద్యుల పరిశీలనలో ఉండాలి. వారు ఇతరులతో కలవకూడదు. వైద్య పరిశీలనలో ఉన్న వారి వద్దకు సందర్శకులకు అనుమతించకూడదు. అవసరమైతే తప్ప జనసామర్థ్యం ఉండే బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. తిరిగేటప్పుడు మాస్క్‌లు ధరించడం మంచిది.

జాగ్రత్తలు : దగ్గేటప్పుడే, తుమ్మేటప్పుడు, చీదేటప్పుడు చేతిరుమాలు కచ్చితంగా అడ్డు పెట్టుకోవాలి. చైనా నుంచి వచ్చిన వ్యక్తుల్లో ఎవరైనా మన సమీప ప్రాంతాలకు చెందిన వారైతే 28 రోజుల తర్వాత మీకు ఏదైనా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులుంటే వెంటనే స్థానిక ఆస్పత్రుల్లో కానీ హెల్ప్‌లైన్‌ నంబర్‌లో కానీ సంప్రదించాలి.

హోళీ వేడుకలు లేవు, హోళీ మిలన్‌కు దూరంగా అగ్రనేతలు

ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.

15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్‌-19 వైరస్

జ్వరంతో ప్రారంభం: కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది. వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది. కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు.

14 రోజుల సమయం: సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి వ్యాధి బయట పడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుందని డబ్యూహెచ్ఓ చెబుతుండగా కొందరు పరిశోధకులు మాత్రం 24 రోజుల వరకు సమయం తీసుకుటుందని చెబుతున్నారు.

ఉడికించిన మాంసమే మేలు : ప్రస్తుతం హాఫ్‌ బాయిల్, తందూరి, తదితర ఆహార పదార్థాలు తీసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అది మంచి పద్ధతి కాదు. మాంసాన్ని బాగా ఉడికించి మాత్రమే తినాలి. వాటిపై ఈగలు వాల కుండా చూడాలి. ఇంట్లో వండేటప్పుడు వంటగదిలో ఆహార పదార్థాలపై పురుగులు పడకుండా చూడాలి. పూర్తిగా మంట పెట్టి, మాంసం పూర్తిగా ఉడికిన తర్వాత భుజించాలి.

కలుషిత ఆహారం తినొద్దు : కలుషిత ఆహారం, ఈగలు, దుమ్ము ధూళి చేరిన ఆహార పదార్థాలను తినడం కూడదని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లకూడదని పేర్కొంటున్నారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు శుభ్రమైన నీటితో కడగాలని, భోజనం వండేవారు, వడ్డించేవారు తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ప్రజలకు అవగాహన : కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కరపత్రాలతో ప్రచారం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేర కు జాతీయ ఆరోగ్యమిషన్‌ చర్యలకు ఉపకరించింది. వ్యాధి బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం మంచిందని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.