COVID-19 Vaccine Update: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి విరుగుడు మందు, ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి.., భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మీద క్లినికల్ టెస్టులు వేగవంతం చేసిన ఐసీఎంఆర్
ఇప్పటికే ప్రముఖ ఔషధ కంపెనీలన్నీ వైరస్ విరుగుడును కనిపెట్టే ప్రకియలో నిమగ్నమయ్యాయి. అయితే అవేమి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 15 కల్లా వ్యాక్సిన్‌ను (COVID-19 Vaccine Update) విడుదల చేస్తామని చల్లని కబురు చెప్పింది.
New Delhi, July 3: ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కరోనావైరస్ కు విరుగుడు మందు హైదరాబాద్ ( Hyderabad) నుంచే రానుందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఔషధ కంపెనీలన్నీ వైరస్ విరుగుడును కనిపెట్టే ప్రకియలో నిమగ్నమయ్యాయి. అయితే అవేమి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 15 కల్లా వ్యాక్సిన్‌ను (COVID-19 Vaccine Update) విడుదల చేస్తామని చల్లని కబురు చెప్పింది. భారత సైనికుల మధ్య అనూహ్యంగా ప్రధాని మోదీ, సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో లడఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన, ప్రధాని వెంట బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే
వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని, ఇప్పటికే నిర్వహించిన జంతువులపై ప్రయోగం మెరుగైన ఫలితాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఐసీఎంఆర్ క్లినికల్ టెస్టులు వేగవంతం చేయనుంది. పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కరోనా నివారణ కోవాక్సిన్‌ను భారత్ బయోటిక్‌తో కలిసి ఐసీఎంఆర్ రూపొందిస్తోంది. మానవులపై కోవాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే వైరస్‌పై సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా ఈ ఔషధం నిలువనుంది. మాస్క్ ఉన్నా కరోనాతో డేంజరే, దేశంలో రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కేసులు నమోదు, 6,25,439కు చేరిన మొత్తం కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య
మానవుల మీద ప్రయోగం ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్‌ను లాంచ్ చేయాలని ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్.. భారత్‌బయోటెక్ సంస్థకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఐసీఎంఆర్ అధికారులు .. ఈ లేఖపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. అది కేవలం ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే రాసిన లేఖ అని ఐసీఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది.
Here's ANI Tweet
ఆ సంస్థ ఇప్పటికే మానవ ట్రయల్స్ స్టార్ట్ చేసింది. అయితే ట్రయల్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్‌బయోటెక్ సంస్థను ఐసీఎంఆర్ కోరినట్లు తెలుస్తోంది. సార్స్ సీవోవీ-2 వైరస్ జన్యువు ఆధారంగా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు. ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ఇన్స్‌టిట్యూట్, బీబీఐఎల్‌లు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ తయారీపై పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయాలని ఐసీఎంఆర్ మొత్తం 12 ఫార్మా సంస్థలను కోరినట్లు తెలుస్తోంది. అయితే ట్రయల్స్‌ను యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఐసీఎంఆర్ డైరక్టర్ డాక్టర్ భార్గవ .. జూలై 7వ తేదీన భారత్‌బయోటెక్ సంస్థకు లేఖ రాశారు.
మరోవైపు ప్రపంచం నలుమూలల్లో కనీసం మూడు నాలుగు కొత్త వ్యాక్సిన్లు ఆశాజనక ఫలితాలు చూపుతున్నాయి. కోవిడ్–19ను జయించగలమన్న భరోసాను ప్రజల్లో కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్, చైనాలోని కాన్‌సైనో, ఆస్ట్రేలియాలోని వ్యాక్సైన్‌లు కీలకమైన దశలు దాటుకుని వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా సాగుతున్నాయి.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించే వ్యాక్సిన్ రావాడానికి.. పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డాక్టర్ డేవిడ్ నబారో తెలిపారు. ఓ భారతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని చెప్పడమే కాక మానవులు మీద ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నబారో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతానికైతే కరోనాను పూర్తిగా తగ్గించే చికిత్స ఏది లేదన్నారు. ఎవరైనా అలాంటి వాదనలు చేస్తే.. పూర్తి సాక్ష్యాలు చూపించమని కోరాలి అన్నారు.