Cyclone Michaung: అర్థరాత్రి తీరం దాటనున్న మైచాంగ్ తుఫాను, భారీ వర్షాలకు చెన్నైలో ఐదుగురు మృతి, రోడ్డు మీదకు వచ్చిన మొసలి, తాజా అప్‌డేట్స్ ఇవిగో..

ఎడతెరపిలేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. రోడ్లన్నీ జలమయమై నదులను తలపిస్తున్నాయి.

Cyclone Michaung Intensifies in Tamil Nadu (Photo Credits: X/@dt_next)

Chennai, Dec 4: మైచాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమైంది. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. రోడ్లన్నీ జలమయమై నదులను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ భారీ వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.

మైచాంగ్ తుఫాను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం- నెల్లూరు మధ్య ఈ అర్ధరాత్రి తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విపత్తు నుంచి బయటపడేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నైలోని పలు రహదారులు జలమయమయ్యాయి. చెన్నైకి సమీపంలోని పెరుంగళత్తూరు-నెడుంకుండ్రం రహదారి వద్ద ఓ మొసలి కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది.

వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద, మిచాంగ్ తుఫాను విధ్వంసానికి చెన్నై ఎలా విలవిలలాడుతుందో వీడియోల్లో చూడండి

భారీ వర్షాలతో ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతాయం ఏర్పడింది. ఒకచోట మొసలి రోడ్డుపైకి దృశ్యంతోపాటు, తుపాను బీభత్సానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Here's Videos

రన్‌వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. దీంతోపాటు ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరించారు.రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో చెన్నై ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. దీంతో నగర వాసుల ఇబ్బందులు అన్ని ఇన్నీకావు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు పాక్షికంగా లేదా పూర్తిగా రైళ్ల సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల ధాటికి కొట్టుకుపోయిన కార్లు, వీడియో ఇదిగో..

చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మంగళవారం చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలతో పాటు పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. అయితే, అత్యవసర సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

తమిళనాడులో తుపాను పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మాట్లాడారు. తుపాను ప్రభావం, నష్టాలకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. భారీ వర్షాల ప్రభావంతో ఇప్పటికే మూత పడిన చెన్నై విమానాశ్రయాన్ని మంగళవారం ఉదయం 9గంటల వరకు మూసి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Here's Videos

భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీలకు కీలక విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు మంగళవారం సాధ్యమైనంత మేరకు వర్క్‌ఫ్రం హోమ్‌ ఇవ్వాలని కోరింది. స్టాలిన్ సర్కారు సహాయక చర్యల్ని వేగవంతం చేసేందుకు 13మంది మంత్రులను నియమించగా.. క్షేత్రస్థాయి పనుల్లో వారంతా నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. ఈ విపత్తును అందరం కలిసి ఎదుర్కొని ప్రజలకు సాయం చేద్దాం అని పిలుపునిచ్చారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif