Cyclone Yaas Update: దూసుకొస్తున్న యాస్ తుఫాన్, అల్లకల్లోలంగా బంగాళాఖాతం తీర ప్రాంతాలు, రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్న యాస్, ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసిన ఐఎండీ

రాబోయే 12 గంటల్లో యాస్‌ తుఫాను అతి తీవ్ర తుఫానుగా (Cyclone Yaas Update) మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయువ్య దిశగా కదిలిందని (Cyclone Yaas Movement) పేర్కొంది.

Cyclone Yaas (Photo Credits: IMD)

Kolkata, May 25: యాస్ తుఫాన్ దూసుకొస్తోంది. రాబోయే 12 గంటల్లో యాస్‌ తుఫాను అతి తీవ్ర తుఫానుగా (Cyclone Yaas Update) మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయువ్య దిశగా కదిలిందని (Cyclone Yaas Movement) పేర్కొంది.

తూర్పు, మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు తుఫాను ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ (IMD) పేర్కొంది.

ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్‌కు ఉత్తర వాయువ్య దిశగా 710 కి.మీ, పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 450 కి.మీ, బాలాసోర్‌కి ఆగ్నేయ దిశగా 550 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల మధ్య కేంద్రీకృతమైంది. గత ఆరు గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ఇది మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుపాన్‌గా, 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా బలపడనుందని విశాఖ తుపాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం, దేశంలో తాజాగా 1,96,427 మందికి కోవిడ్, ప్రస్తుతం భారత్‌లో 25,86,782 యాక్టివ్ కేసులు, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న టీకాల డ్రైవ్‌

బుధవారం తెల్లవారుజామున ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం పారాదీప్, సాగర్‌ ఐలాండ్స్‌ మధ్య చాలా తీవ్రమైన తుపాన్‌గా (Very Severe Cyclonic Storm) మారి బుధవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

యాస్ తుఫాన్ లైవ్ ట్రాకర్ 

అతి తీవ్ర తుపాన్‌గా మారినప్పుడు గంటకు 135 నుంచి 160 కి.మీ. వేగంతో, తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165 కి.మీ, గరిష్టంగా 185 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌.. సిక్కిం రాష్ట్రాలపై, స్వల్పంగా జార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో పలు చోట్ల వర్షం

ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో పలు చోట్ల వర్షం కురుస్తున్నది. తుఫాను నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి సోమవారం ఏపీ, ఒడిశా, బెంగాల్‌ ముఖ్యమంత్రులు, అండమాన్‌ నికోబార్‌ దీవుల లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేంద్ర శాఖలు అన్ని విధాలుగా సహకరిస్తాయని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత మేరకు విద్యుత్పత్తి కేంద్రాల్లో సరఫరా నిలిచిపోకుండా చూడాలని కోరారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లపై తుఫాను ప్రభావం, వాటి రక్షణపై చర్చించారు. రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు అధికంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే తాత్కాలిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.

ఒడిశా ప్రభుత్వం అప్రమత్తం

యాస్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రచండగాలుల వేగానికి పూరిగుడిసెలు కొట్టుకుపోతుండడంతో అందులో ఉంటున్నవారిని సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓ పూరిగుడిసె గాలులకు కొట్టుకుపోగా అందులో ఉన్న 91ఏళ్ల వృద్ధురాలిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని సిబ్బంది డోలీలో తీసుకువెళ్లారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 10 లక్షలమంది సురక్షిత ప్రాంతాలకు 

యాస్ తుపాన్ అంఫాన్ తుఫాన్ కంటే తీవ్రత ఉండే అవకాశం ఉన్నందున పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 10 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. 20 జిల్లాలను ప్రభావితం చేయనున్న ఈ తుపాన్ ముప్పు సందర్భంగా ప్రాణనష్టం జరగకుండా చూడాలని సీఎం మమతాబెనర్జీ అధికారులను ఆదేశించారు.తుపాన్ వల్ల కోల్‌కతా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పూర్బా మెడినిపూర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని మమతాబెనర్జీ చెప్పారు.యాస్ తుపాను హౌరా, హుబ్లీ, బంకురా, బిర్భుమ్, నాడియా, పస్చిమ్, పూర్బా బర్ధామన్, పస్చిమ్ మెడినిపూర్, ముర్షిదాబాద్, పురులియా జిల్లాలపై కూడా ప్రభావం చూపనుంది.

తుఫానుగా మారనున్న వాయుగుండం, 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం, పలు రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ, అప్రమత్తమైన పలు రాష్ట్రాలు

సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం కోరింది. 51 విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచామని సీఎం చెప్పారు. పశ్చిమబెంగాల్ లో యాస్ తుపాన్ దృష్ట్యా 13 ప్రాంతాల్లో జలరవాణాను నిలిపివేశారు.మంగళవారం నుంచి బెంగాల్ రాష్ట్ర సచివాలయంలోని కంట్రోల్ రూం 48 గంటలు పనిచేస్తుందని సీఎం తెలిపారు. వెయ్యికి పైగా విద్యుత్ పునరుద్ధరణ బృందాలు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. బెంగాల్ లో తుపాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు.

ఉత్తర బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు అల్లకల్లోలం

యాస్ తుఫాన్ కారణంగా తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఏపీలో కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. బుధవారం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, సముద్రంలో అలలు 4.5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

ఈనెల 27వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను కేంద్రం హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎండీ కమిషనర్ కన్నబాబు సూచించారు. రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవుల్లో రెండో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. కలింగపట్నం సహా ఇతర ఓడరేవులకు అధికారులు తుపాను సమాచారం అందించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

యాస్‌ తుపాను దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని తెలిపారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ శ్రీకాకుళం జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కన్పించలేదని సీఎస్‌ తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్‌ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని.. విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, డీజిల్‌ సిద్ధం చేశాం అని ఆదిత్యనాథ్‌ సీఎం జగన్‌కు తెలిపారు. ఇక తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం అలజడిగా ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ఒక ప్రకటనలో సూచించారు.



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం