Covid in India: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం, దేశంలో తాజాగా 1,96,427 మందికి కోవిడ్, ప్రస్తుతం భారత్‌లో 25,86,782 యాక్టివ్ కేసులు, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న టీకాల డ్రైవ్‌
Coronavirus in India | Representative Image (Photo Credits: PTI)

New Delhi, May 25: దేశంల కరోనా కేసులు తాజాగా 2 లక్షల దిగువకు వచ్చాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసులు (Covid in India) నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి నుంచి కోలుకుని 3,26,850 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా 3,511 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 2,69,48,874 మంది కరోనా బారిన (Coronavirus in India) పడ్డారు.

వీరిలో 2,40,54,861 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు చనిపోయినవారి సంఖ్య 3,07,231కి చేరింది. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 19,85,38,999 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. లాక్ డౌన్లు మరికొంత కాలంపాటు కొనసాగితే కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఒకే రోజు దాదాపు 4.5 లక్షల పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ విధించడమో, లేక కఠినమైన కర్ఫ్యూని అమలు చేయడమో చేస్తున్నాయి. దీంతో, కరోనా వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందని తెలుస్తోంది.

పీఎన్‌బీ కుంభకోణం, మెహుల్‌ చోక్సీ మిస్సింగ్, అంటిగ్వా దీవిలో అదృశ్యమయ్యారని వెల్లడించిన ఆయన న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌, రూ.7,080 కోట్లు మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న వజ్రాల వ్యాపారి

దేశంలో టీకాల డ్రైవ్‌ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు 19,84,43,550 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. 18-44 సంవత్సరాల వయస్సున్న 12,52,320 మంది లబ్ధిదారులకు సోమవారం మొదటి డోసు అందజేసినట్లు చెప్పింది. మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,18,81,337 మందికి మొదటి మోతాదులు అందజేసినట్లు చెప్పింది.

వెలుగులోకి ఇంకో డేంజరస్ ఫంగస్, మనుషులపై దాడి చేస్తోన్న ఎల్లో ఫంగస్‌, యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో తొలి కేసు, Yellow Fungus అంటే ఏంటి, ఈ కొత్త ఫంగస్ లక్షణాలు, చికిత్స, జాగ్రత్తల గురించి ఓ సారి తెలుసుకోండి

బిహార్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 18-44 సంవత్సరాల వయస్సున్న వారికి 10లక్షలకుపైగా డోసులు వేశాయని వివరించింది. టీకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నాటికి 129వ రోజు చేరగా.. ఒకే రోజు 23,65,395 వ్యాక్సిన్‌ మోతాదులు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందులో 21,90,849 మందికి మొదటి మోతాదు, 1,74,546 మంది రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది.