Yellow Fungus: వెలుగులోకి ఇంకో డేంజరస్ ఫంగస్, మనుషులపై దాడి చేస్తోన్న ఎల్లో ఫంగస్‌, యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో తొలి కేసు, Yellow Fungus అంటే ఏంటి, ఈ కొత్త ఫంగస్ లక్షణాలు, చికిత్స, జాగ్రత్తల గురించి ఓ సారి తెలుసుకోండి
virus Representational Image (Photo Credits: File Image)

Lucknow, May 24: దేశంలో కొత్త కొత్త వైరస్ లు కలకలం రేపుతున్నాయి. కరోనావైరస్ దెబ్బకు దేశం వణుకుతుండగా..రికవరీ అయిన పేషెంట్లపై బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ దాడి చేస్తున్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు మళ్లీ ఇంకో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఎల్లో ఫంగస్ (Yellow Fungus) ఇప్పుడు దేశంలో కలవరం పుట్టిస్తోంది. ఎల్లో ఫంగస్‌కు సంబంధించిన తొలికేసు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో national capital region (NCR) పరిధిలో వెలుగుచూసింది.

ఇది బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్‌ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లో ఫంగస్ సోకిస వ్యక్తికి ప్రముఖ ఈఎన్‌టీ స్పెషలిస్టు నేతృత్వంలో చికిత్స అందుతోంది. ఈ వ్యాధి సోకిన రోగి ప్రస్తుతం ప్రముఖ ENT సర్జన్ బ్రిజ్ పాల్ త్యాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇంతకీ ఎల్లో ఫంగస్ లక్షణాలు (Symptoms of Yellow Fungus) ఎలా ఉంటాయని పరిశీలిస్తే..మనిషిలో బద్దకం ఎక్కువగా ఉండటం, నిదుర మత్తు కలిగి ఉండటం, ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఎల్లో ఫంగస్ మరింత తీవ్రంగా మారిందంటే మనిషిలో మరిన్ని మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. అంటే నిత్యం చీము కారడం, ఒకవేళ ఏమైనా గాయాలుంటే ఆ గాయాలు మానకపోవడం, గాయాలు మానేందుకు చాలా రోజుల సమయం పట్టడం, ఒంట్లో భాగాలు పనిచేయకపోవడం, కళ్లు లోపలికి పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

కొత్తగా వైట్‌ ఫంగస్‌ వెలుగులోకి, నేరుగా ఊపిరితిత్తులపై దాడి, పాట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌, బ్లాక్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమంటున్న వైద్యులు, వైట్‌ ఫంగస్‌ లక్షణాలు. చికిత్స గురించి తెలుసుకోండి

ఎల్లో ఫంగస్ శరీరంలో అంతర్గతంగా ఏర్పడి దాడి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలని లేదంటే ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్లో ఫంగస్‌కు యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ మాత్రమే విరుగుడని చెప్పారు. ఎల్లో ఫంగస్ అనే వ్యాధి రావడానికి ప్రధాన కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు.

చిన్నపిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకు ఎప్పుడు పరీక్షలు చేయించాలి, కోవిడ్ సోకిన తల్లి, బిడ్డకు పాలివ్వొచ్చా, డాక్టర్లు చెబుతున్న విషయాలు మీకోసం

వ్యక్తిగత శుభ్రత కూడా మెయిన్‌టెయిన్ చేయాలని, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే బ్యాక్టీరియా ఫంగస్‌ పేరుకుపోయి దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంటిలో తేమ శాతం కూడా చూసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా మరియు ఫంగస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని చెప్పారు. 30శాతం నుంచి 40శాతం మధ్య తేమశాతం ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరుగుదలను నివారించడానికి పాత ఆహారాలు వ్యర్థ పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించాలని కోరుతున్నారు.