Jagan Assets Case: సీబీఐ కేసులో తెలంగాణా హైకోర్టుకు ఏపీ సీఎం, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన తెలంగాణా హైకోర్టు,తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా
పిబ్రవరి 6వ తేదీకి ఈ కేసు సంబంధించిన విచారణను వాయిదా వేసింది.
Hyderabad, January 28: సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపును కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ను తెలంగాణా హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. పిబ్రవరి 6వ తేదీకి ఈ కేసు సంబంధించిన విచారణను వాయిదా వేసింది.
కాగా తనపై ఉన్న సీబీఐ (CBI) కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై న్యాయస్థానం (Telangana HC) ఇవాళ విచారణ జరిపింది. జగన్ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
మీ గ్రామంలోకి సీఎం జగన్ వస్తున్నాడు
వచ్చే శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని న్యాయస్థానం సూచించింది.
అరకు, మచిలీపట్నం, గురజాలతో 15 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్
ఇదిలా ఉంటే సీబీఐ కోర్టుకు జగన్ వ్యక్తిగత మినహాయింపు పిటిషన్ ను సీబీఐ కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టును జగన్ ఆశ్రయించారు.
పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం
ఏపీ రాష్ట్ర (Andhra Pradesh) సీఎంగా ఉన్నందున పరిపాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున ప్రతి వారం వ్యక్తిగత విచారణకు హాజరు కాలేనని, తన తరపున లాయర్ వస్తారని ఏపీ సీఎం సీబీఐ కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ పటిషన్లు కొట్టివేసింది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని తెలిపింది.