Maya Shankar Pathak: విద్యార్థినిపై బీజేపీ నేత లైంగిక దాడి, చిక్కుల్లో పడిన మాజీ ఎమ్మెల్యే మాయ శంకర్‌ పతాక్‌, ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత వీడియోని విడుదల చేసిన యువతి

తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడం యూపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది.

Maya Shankar Pathak beaten up for harassing girl (Photo Credits: YouTube)

Varanasi, Jan 11: యూపీకి చెందిన బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మాయ శంకర్‌ పతాక్‌ (Maya Shankar Pathak) లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నారు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడం యూపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. యూపీ చబీపూర్‌ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వారణాసి సమీపంలోని భగుటా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని శంకర్‌ పతాక్‌కు చెందిన విద్యాసంస్థల్లో ఇంటర్‌ చదువుతోంది.

ఈ క్రమంలోనే ఆ విద్యార్థినిని తన రూమ్‌లోకి పిలుపించుకున్న మాజీ ఎమ్మెల్యే.. మొదట ఆమెపై దాడికి పాల్పడి ఆపై లైంగికంగా (sexually assaulting) వేధించాడు. ఈ విషయాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కళాశాలకు చేరుకుని పతాక్‌కు నిలదీయగా క్షమాపణలు చెప్పి తప్పించుకున్నాడు. అయితే దీనిపై యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదు. అయితే ఈ ఘటన జరిగిన చాలా కాలం తరువాత ఆ యువతి ఓ వీడియోను విడుదల చేసింది.తనపై పతాక్‌ లైంగిక దాడికి ( sexually assaulting girl student) పాల్పడ్డాడని, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడని ఆ వీడియోలో పేర్కొంది.

Former BJP MLA, Thrashed By Family Members in College Premises

అంతేకాకుండా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా బీజేపీలో సీనియర్‌ నేతగా పేరొందిన 70 ఏళ్లు శంకర్‌.. 1991లో ఓసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత విద్యాసంస్థలను స్థాపించి వాటికి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాజాగా అతనిపై లైంగిక ఆరోపణలు రావడంతో బీజేపీ నేతలు స్పందించారు.

అక్రమ సంబంధం, నీ మరదల్ని చంపేశా వెళ్లి చూసుకో అంటూ బావకి ఫోన్, అనంతపురంలో విషాద ఘటన, అనాధలైన ఇద్దరు పిల్లలు

చాలాకాలం నుంచి అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. మరోవైపు ఆ యువతి లీక్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో కేసు విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు.