Pune, March 27: పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు విలవిలలాడిపోతున్నారు. దీంతో అంతా ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టారు. పెట్రోల్ (Petrol), డీజిల్ (Desiel)కొనే పని లేని వాహనాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఫ్యూయల్ అవసంర లేదు. ఛార్జింగ్ పెడితే చాలు. దీంతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్ (Electric) లకు ఆదరణ పెరిగింది. ఇటీవలి కాలంలో వీటి సేల్స్ విపరీతంగా పెరిగాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ బైక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. బాంబుల్లా పేలిపోతున్నాయి. బ్యాటరీలో మంటలు చెలరేగి కాలిపోతున్నాయి. వీటి కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. తాజాగా ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు పేలిపోయాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

పుణెలో ఓలా ఎస్‌ 1 (Ola Bike) ఎలక్ట్రిక్ బైక్ కాలిపోయింది. రోడ్డుపై వెళ్తుండగా బైక్‌లో మంటలు చెలరేగాయి. అయితే బైక్‌పై ఉన్న ప్రయాణికుడు దిగి పారిపోవడంతో ప్రాణాలు దక్కాయి. ఓలా బైక్ పేలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఓలా స్పందించింది. పేలుడుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పింది. గతంలో కూడా ఇలాగే ఓలా బైక్‌లో మంటలు చెలరేగాయి. ఇలా ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగడం ఇది తొలిసారి కాదు.

Electric Bike Sets On Fire: ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో తండ్రి, కూతురు మృతి, తమిళనాడులో విషాదం, షాక్ లో కుటుంబ సభ్యులు..

మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి చెందారు.ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బాంబులా పేలిపోయింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. వేలూరు(Vellore ) జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె ప్రీతి (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం దురై వర్మ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రించారు. ఇంతలో దారుణం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీలో (electric bike) మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత పేలిపోయింది.

Bajaj Chetak e-Scooter: త్వరలో విడుదల కాబోతున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, పుణెలో ప్రదర్శనకు ఉంచిన బజాస్ సంస్థ, ఈ స్కూటర్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

కాగా, కొత్త ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు పక్కనే పార్క్ చేసిన పెట్రోల్‌తో నడిచే మరో బైక్‌కు మంటలు అంటుకోవడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిద్రపోతున్న తండ్రి, కూతురు ఎలక్ట్రిక్ బైక్‌ కారణంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో స్థానింగా విషాదం అలుముకుంది. కాగా, ఓవర్ ఛార్జింగ్ కారణంగా బైక్ పేలిపోయినట్లు తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

Amit Shah Fake Video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు, తెలంగాణలో 5 మంది కాంగ్రెస్ నేతలు అరెస్ట్

Telangana Elections 2024: మూడు ప్రధాన పార్టీలకు షాకిచ్చిన బర్రెలక్క, నాగర్ కర్నూల్ నుంచి లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ, నామినేషన్ వేసిన కర్నె శిరీష

Viral Video, Maharashtra Shocker: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..ధాబాలో అన్నం తింటున్న మనిషిని గన్‌తో కాల్చి, కత్తులతో పొడిచి..కిరాతకంగా చంపేశారు..

Amit Shah Slams Congress: తెలంగాణ గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి చూపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపు

Geethanjali Suicide Case: ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసు, అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు, నా భార్య మృతికి ట్రోలింగే కారణమన్న ఆమె భర్త

Hyderabad Shocker: పెళ్ళి అయి పిల్లలున్న అధ్యాపకుడుపై మనసు పారేసుకున్న విద్యార్థిని, ప్రేమించడం లేదని న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్‌, భయపడి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Mephedrone Seized: ఢిల్లీ, పుణెలో భారీ ఆపరేషన్, రూ.2,500 కోట్ల విలువైన మెఫెడ్రోన్‌ పట్టుకున్న అధికారులు, దాదాపు 1,100 కిలోల నిషేధిత డ్రగ్‌ సీజ్

Rahul Gandhi Supports YS Sharmila: వైయ‌స్ ష‌ర్మిల‌కు అండ‌గా నిలిచిన రాహుల్ గాంధీ, సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులను తీవ్రంగా ఖండించిన రాహుల్