PM KISAN Yojna: రైతన్నలకు గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లలోకి పీఎం-కిసాన్‌ పథకం డబ్బులు

అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్‌ పథకం 18వ విడత నిధులు శనివారం విడుదల కానున్నాయి. ఈ పథకం కింద నేడు రూ.20 వేల కోట్ల నిధుల విడుదలతో దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి జరగనుంది.

agriculture (photo-ANI)

Newdelhi, Oct 5: రైతన్నలకు (Farmers) శుభవార్త. అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్‌ పథకం (PM KISAN Yojna) 18వ విడత నిధులు శనివారం విడుదల కానున్నాయి. ఈ పథకం కింద నేడు రూ.20 వేల కోట్ల నిధుల విడుదలతో దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి జరగనుంది. రైతులు ప్రత్యక్ష బదిలీ (డీబీటీ) ద్వారా ఈ ప్రయోజనాలను పొందుతారు. 18వ విడత నిధుల‌ను మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. నమో శేట్కారీ మహాసన్మాన్‌ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులు అదనంగా మరో రూ.రెండు వేల కోట్లు పొందనున్నారు.

చార్మినార్‌ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌ చ‌ల్‌.. ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు (వీడియో)

ఇప్పటి వరకూ రూ.3.45 లక్షల కోట్లు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం-కిసాన్‌ కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు ఇప్పటి వరకూ రూ.3.45 లక్షల కోట్లను సహాయంగా పొందారు. ఈ స్కీమ్‌ ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి 6 వేల రూపాయలను కేంద్రం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేస్తోంది. ఇవి పంట పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతున్నాయి.

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి



సంబంధిత వార్తలు