Railway Exam Cheating: రైల్వే జాబ్ కోసం బొటనవేలు కోసుకున్న వ్యక్తి, స్నేహితుడికి తన బొటనవేలు పెట్టి పరీక్ష రాసేందుకు పంపిన వ్యక్తి, గుజరాత్‌లో బయటపడ్డ హైటెక్ కాపీయింగ్, శానిటైజర్ పూయడంతో ఊడిపోయిన వేలు
అప్పటికే సూపర్వైజర్కు అనుమానం కలిగింది. అంతలోనే అతడు తన ఎడమ చేతిని జేబులో పెట్టుకున్నాడు. అనుమానం మరింత బలపడడంతో వేలిపై సానిటైజర్ పూశాడు. అంతే అతికించిన తోలు వేలి నుంచి ఊడి కింద పడింది. మనీశ్ మోసం బయటపడింది’’ అని తెలిపారు.
Vododara, AUG 25 : ద్రోణాచార్యుడికి గురుదక్షిణ ఇవ్వడం కోసం ఏకలవ్యుడు బొటనవేలిని కోసుకున్నాడని పుస్తకాల్లో చదివే ఉంటాం. అయితే ఒక వ్యక్తి పరీక్ష(Exam) కోసం తన బొటన వేలిని కోసుకున్నాడు. వేలు మొత్తాన్ని కత్తించలేదు కానీ, వేలిముద్ర వేయడానికి (Finger Print) కావాల్సినంత తోలును పెనపై వేడి చేసి ఊడపీకాడు. అనంతరం తన స్నేహితుడి చేతికి (Removes thumb) అతికించాడు. ఎలాగైనా సరే.. తన స్నేహితుడు ఈ పరీక్ష రాసి పాసై తనకు ఉద్యోగం సంపాదించి పెడతాడని తన నమ్మకం. కానీ అనుకున్నది ఒకటైతే, జరిగింది మరొకటి. పరీక్ష హాలుకు వెళ్లగానే అసలు విషయం బయట పడింది. ఎగ్జామ్ సూపవర్ వైజర్ సానిటైజర్ (Sanitaizer) పూయగానే అతికించిన తోలు ఊడిపోయి కింద పడింది. గుజరాత్‌లోని వడోదలో జరిగిన ఘటన తాజాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వడోదర పోలీసులు బుధవారం మనీష్ కుమార్ (Manish kumar), రాజ్యగురు గుప్తలను (Rajyaguptha) అరెస్ట్ చేశారు. ఇందులో మనీశ్ కుమార్ బొటన వేలిని కోసుకున్న రైల్వే అభ్యర్థి రాజ్యగురు, స్నేహితుడి కోసం పరీక్ష రాయడానికి సిద్ధమైన త్యాగశీలి. వీరిది బిహార్‌లోని ముంగర్ జిల్లా. వీరిద్దిరూ ఈ మద్యే 12వ తరగతి పూర్తి చేశారట. ఇద్దరికీ అటుఇటుగా 20 ఏళ్లు ఉంటాయని వడోదర అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎం వరోటరియా తెలిపారు. వడోదరలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఆగస్టు 22న 600 మంది అభ్యర్థుల సామర్థ్యంతో రైల్వే (గ్రూప్ డీ) పరీక్ష నిర్వహించారు. ఆరోజే మనీశ్‌కు బదులు పరీక్ష రాయడానికి వెళ్లిన రాజ్యగురు దొరికిపోయాడు.
ఈ విషయమై వరోటరియా మాట్లాడుతూ ‘‘పరీక్ష నిష్పాక్షికంగా నిర్వహించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆధార్‌లో ఉన్న డేటా ఆధారంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారు. కానీ మనీశ్ కుమార్ డేటా ఎంటర్ కావడం లేదు. అతడి బయోమెట్రిక్ (Bio metric) తీసుకోవడంలో డివైస్ ఫెయిల్ అవుతోంది. అప్పటికే సూపర్వైజర్కు అనుమానం కలిగింది. అంతలోనే అతడు తన ఎడమ చేతిని జేబులో పెట్టుకున్నాడు. అనుమానం మరింత బలపడడంతో వేలిపై సానిటైజర్ పూశాడు. అంతే అతికించిన తోలు వేలి నుంచి ఊడి కింద పడింది. మనీశ్ మోసం బయటపడింది’’ అని తెలిపారు. ఇద్దరు నిందితులపై భారత శిక్షా స్మృతిలోని 465, 419, 120-బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వరోటరియా తెలిపారు.