Garlic Price @250: 250 రూపాయలను టచ్ చేసిన వెల్లుల్లి, ఉల్లి ధరలు ఇంకా ఘాటుగానే..మహారాష్ట్ర నుంచి దిగుమతులు బంద్, నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలంటూ రైతుల ధర్నా
తాజాగా దీని సరసన ఇప్పుడు వెల్లుల్లి కూడా చేరింది. ఆంధ్రప్రదేశ్ లో వెల్లుల్లి ధర 250 రూపాలయకు చేరినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా దిగుమతి అయ్యే ఉల్లి, వెల్లుల్లి దిగుబడి తగ్గిపోవటంతో ధరలు భారీగా పెరిగాయి. గత కొంత కాలం నుంచి మహారాష్ట్రలో తరచూ భారీ వర్షాలు కురవటం..వరదలు వెల్లువెత్తటంతో పంటలు నాశనమయ్యాయి.
Mumbai, November 15: గత కొద్ది రోజుల నుంచి ఉల్లి ( Onion) అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. తాజాగా దీని సరసన ఇప్పుడు వెల్లుల్లి Garlic) కూడా చేరింది. ఆంధ్రప్రదేశ్ లో వెల్లుల్లి ధర 250 రూపాలయకు చేరినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర (Maharashtra)నుంచి భారీగా దిగుమతి అయ్యే ఉల్లి, వెల్లుల్లి దిగుబడి తగ్గిపోవటంతో ధరలు భారీగా పెరిగాయి. గత కొంత కాలం నుంచి మహారాష్ట్రలో తరచూ భారీ వర్షాలు కురవటం..వరదలు వెల్లువెత్తటంతో పంటలు నాశనమయ్యాయి.
దీంతో దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు (Onion Price) ఆకాశనంటాయి. కిలో ఉల్లి రూ.150కి చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా మహారాష్ట్రలో రైతులు నినసన చేపట్టారు. వర్షాల దెబ్బకు పంటలు నాశనమయ్యాయని ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలంటూ రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు.
మహారాష్ట్ర నుంచి వెల్లుల్లి దిగుమతులు బంద్ కావడంతో ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి మాత్రమే వెల్లుల్లిని దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ధరల రేట్లు ఏమాత్రం తగ్గటంలేదు. డిమాండ్ తగ్గిన ఉత్పత్తి లేకపోవటంతో ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు రేట్లు భారీగా పెరిగాయి.
గత రెండు నెలల క్రితం కిలో ఉల్లి రూ.20 ఉండగా అది అమాతం పెరిగి రూ.50కి చేరగా ప్రస్తుతం రూ.70 నుంచి 100వరకూ వ్యాపారులు అమ్ముతున్నారు . అలాగే వెల్లుల్లి కూడా రెండు నెలల క్రితం కిలో రూ.70 నుంచి 90 ఉండగా ప్రస్తుతం రూ.250కి చేరుకుంది.