Himachal Pradesh: నిద్రలో వెంటాడిన పీడకలలు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి, పీడ క‌ల‌లు రావడంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు సూసైడ్ లేఖ

నిద్ర స‌రిగా రావ‌డం లేద‌ని, పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయ‌ని (Sleep deprived student) ఓ యువ‌కుడు త‌న జీవితాన్ని అర్థంతరంగా (ends his life) ముగించాడు.

Representational Image (Photo Credits: File Image)

Shimla, Dec 22: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని కులూ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిద్ర స‌రిగా రావ‌డం లేద‌ని, పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయ‌ని (Sleep deprived student) ఓ యువ‌కుడు త‌న జీవితాన్ని అర్థంతరంగా (ends his life) ముగించాడు. కులు జిల్లా (Kulu District) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కులూ జిల్లాలోని బంజార్ ఏరియాలో ఓ 17 ఏండ్ల యువ‌కుడు త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటున్నాడు. ఆ అబ్బాయి ఇంటర్ మీడియట్ చ‌దువుతున్నాడు.

అయితే గ‌త వారం రోజలు నుంచి ఆ యువ‌కుడు స‌రిగా నిద్ర పోవ‌డం లేదు. రాత్రి స‌మ‌యాల్లో భ‌య‌ప‌డుతూ లేచి కూర్చొనేవాడని తెలిపారు. నిద్రలో పీడ‌క‌ల‌లు వెంటాడుతున్నాయ‌ని ఆందోళ‌న చెందేవాడు. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన విద్యార్థి అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అత‌ని గ‌దిలో సూసైడ్ నోట్ ల‌భించింది. నిద్ర లేక‌పోవ‌డం, పీడ క‌ల‌లు రావడంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు బాధితుడు లేఖ‌లో పేర్కొన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ప్రియుడితో రూంలో శృంగారం, మరో మహిళకు అది ఎలా ఇస్తావంటూ బ్లేడుతో మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు, కోనసీమ జిల్లాలో దారుణ ఘటన

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యువ‌కుడి కుటుంబ స‌భ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు న‌మోదు చేశారు. నిన్న సాయంత్రం ఇంటికి వ‌చ్చి చూడ‌గా త‌మ సోద‌రుడి మృత‌దేహం క‌నిపించింద‌ని అత‌ని సోద‌రి తెలిపింది.