Ram Janmabhoomi Nyas Design: అయోధ్యలో రామ మందిర్ న్యాస్‌ డిజైన్, 2024లోగా నిర్మాణం పూర్తి, ఏర్పాటు కాబోతున్న రామాలయ నిర్మాణ ట్రస్ట్, తీర్పు అందరికీ ఆమోద యోగ్యమన్న విశ్వహిందూ పరిషత్‌

సుప్రీం కోర్టు తీర్పుకు రాజకీయ పార్టీ నాయకుల నుంచి గానీ, ముస్లిం మత పెద్దల నుంచి గానీ పెద్దగా సుప్రీం తీర్పు పట్ల నెగెటివ్ రియాక్షన్ రాలేదు. దీంతో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సున్నీ వక్ఫ్ బోర్డు సైతం ఆ నిర్ణయం నుంచి తప్పుకున్నట్లేనని తెలుస్తోంది.

Hope trust builds temple as per Ram Janmabhoomi Nyas design: VHP Chief (Photo-Twitter)

Ayodhya, November 10: అయోధ్య కేసు( Ayodhya Verdict)లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు (Supreme Court verdict in the Ayodhya case) ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రామమందిర(Ram Temple) నిర్మాణానికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పు పట్ల రాజకీయ పార్టీ నాయకుల నుంచి గానీ, ముస్లిం మత పెద్దల నుంచి గానీ పెద్దగా నెగెటివ్ రియాక్షన్ రాలేదు. దీంతో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సున్నీ వక్ఫ్ బోర్డు సైతం ఆ నిర్ణయం నుంచి తప్పుకున్నట్లేనని తెలుస్తోంది.  అయోధ్యలో రామ‌మందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

అంతే కాకుండా వివాదాస్పద స్ధలాన్ని రామజన్మభూమి న్యాస్‌కే (Ram Janmabhoomi Nyas) అప్పగించింది. అయోధ్య యాక్ట్‌ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని  సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో అక్కడ రామాలయ నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు కాబోతుంది.  అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి

గతంలో రామజన్మభూమి న్యాస్‌ రూపొందించిన డిజైన్‌ ప్రకారమే భవ్యమందిరాన్ని నిర్మించాలని విశ్వహిందూ పరిషత్‌ ఆశిస్తున్నట్లు సమాచారం . ఈ మేరకు వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్‌ కోక్జే (VHP international president Vishnu Sadashiv Kokje)కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయోధ్య కేసులో ఆది నుంచి ఏం జరిగింది ?

అయోధ్య వివాదంపై తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించిన ఆయన ఈ అంశంలో ఎవరూ విజేతలు కాదని, పరాజితులు లేరని, శతాబ్దాలుగా నలుగుతున్న అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత మాత్రమే ఇచ్చిందని, తీర్పు అందరికీ ఆమోద యోగ్యం అయినదని చెప్పారు.  ఢిల్లీలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

ఇదే సమయంలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు రామజన్మభూమి న్యాస్‌ అనేక పనులు పూర్తి చేసిందని, డిజైన్‌ రూపొందించడం, శిల్పాలు, స్తంభాలు చెక్కించడం సహా పలు పనులు న్యాస్‌ ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. అందువల్ల న్యాస్‌ రూపొందించిన డిజైన్‌ను ట్రస్ట్‌ అమలు చేస్తే ఆలయ నిర్మాణం సులభతరం అవుతుందని వెల్లడించారు.

ఇప్పటికైతే ట్రస్ట్‌ తమ అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందని అనుకోవట్లేదని ఆయన అన్నారు. ట్రస్ట్‌లో రామభక్తులే ఉంటారని, అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండవంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2024వరకు రామ మందిరం పూర్తవుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.