Covid-19 Vaccine Registration: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్ చాలా ఈజీ, ఈ పద్ధతిలో మీరు తేలిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం

18 ఏండ్లు పైబ‌డిన వారికి టీకాల కోసం నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మయ్యాయి. కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మ‌య్యాయి. మొబైల్ నంబ‌ర్ ద్వారా రిజిస్ర్టేష‌న్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

COVID-19 Vaccination (Photo Credits: PTI)

New Delhi, April 28: 18 ఏండ్లు పైబ‌డిన వారికి టీకాల కోసం నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మయ్యాయి. కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మ‌య్యాయి. మొబైల్ నంబ‌ర్ ద్వారా రిజిస్ర్టేష‌న్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబ‌డిన వారికి టీకా ఇవ్వ‌నున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు కోసం కేంద్ర ప్రభుత్వం లింక్ అందుబాటులోకి వచ్చింది.

అయితే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో లాగిన్‌ కావడానికి ప్రయత్నించగా, సర్వర్‌ క్రాష్‌(CoWIN server is facing issues) అయ్యింది. సర్వర్లు క్రాష్ అవుతున్నాయని వినియోగదారులు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు లాగిన్ కావడానికి అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్(OTP) కూడా రావడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై అధికారులు స్పందించారు. ఒకేసారిగా అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించడంతో సర్వర్ క్రాష్ అయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించిన వారికి, 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అన్న మెసేజ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ ప్రకటన చేసింది.

కోవిన్ యాప్ క్రాష్, ఒక్కసారిగా అందరూ లాగిన్ కావడంతో సాంకేతిక సమస్యలు, 18 ఏళ్లు పైబడిన వారికి ముందస్తు నమోదుకు మాత్రమే అనుమతి, టీకా కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో తెలుసుకోండి

రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామని, సాయంత్రం 4 గంటల తరువాత రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయని పేర్కొంది. , కొవిన్ వెబ్ సైట్, ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ లలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, ఆపై వారికి దగ్గరలో ఉన్న టీకా కేంద్రాల నుంచి ఆపాయింట్ ఖరారవుతుందని కేంద్రం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

selfregistration.cowin.gov.in ద్వారా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్నికల్పించారు.

కాగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే టీకాలను 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇవ్వరాదన్న ఆదేశాలు రాష్ట్రాలకు అందాయి. రాష్ట్రాలు, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు టీకాలను కొనుగోలు చేసి, వాటిని మూడవ దశ వ్యాక్సినేషన్ లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి అందిచవచ్చని తెలిపింది. 18 సంవత్సరాలు దాటిన వారికి ముందస్తు నమోదు మాత్రమే ఉంటుందని, వారికి వాక్సిన్ రిజిస్ట్రేషన్ ఉండబోదని స్పష్టం చేసింది.

కొవిన్ వెబ్‌సైట్‌లో టీకా కోసం రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్

ముందుగా మీరు కొవిన్ పోర్టల్ (cowin.gov.in ) లేదా ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాలి. అనంత‌రం మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో ఎంట‌ర్ చేసి, వెరిఫై బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. తరువాత రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్‌ వ్యాక్సినేష‌న్ అని పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఫొటో గుర్తింపు కార్డును ఎంచుకుని దాని నంబ‌ర్‌తో పాటు పేరు, పుట్టిన సంవ‌త్సరం వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

భారత్‌లో కరోనా విశ్వరూపానికి ఈ వైరస్సే కారణం, రెండు వైరస్‌ల కలయికతో పుట్టిన బి.1.617 వైరస్‌‌, 17 దేశాలను వణికించేందుకు రెడీ అయిన డబుల్ మ్యూటెంట్ కోవిడ్ వేరియంట్

ఏ గుర్తింపు కార్డులో ఉన్నట్లు వివరాలు నమోదు చేశారో ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్‌ చేయాలి. రిజిస్ట్రేష‌న్ అనంత‌రం ఏ రోజు టీకా వేయించుకోవాలో అందులో షెడ్యూల్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా షెడ్యూల్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంట‌ర్ చేయ‌గానే.. అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల జాబితా క‌నిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, స‌మ‌యాన్ని సెలెక్ట్ చేసుకుని క‌న్ఫార్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. తరువాత వ్యాక్సినేషన్‌ కేంద్రం ఎంచుకోవాలి. అది ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రం ద్వారా టీకా తీసుకోవచ్చు.

కాగా ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవ‌చ్చు. ఏదైతే గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేశారో ఆ వివరాలతో వ్యాక్సినేషన్‌ కేంద్రానికి మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి వెళ్లాలి. అలాగే షెడ్యూల్ తేదీల‌ను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది. కొవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

కోవిడ్ వ్యాక్సిన్ మొబైల్ రిజిస్ట్రేషన్ కోసం అనుసరించాల్సిన విధానాలు:

ముందుగా మీ మొబైల్ ఫోన్ లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి selfregistration.cowin.gov.in అని టైప్ చేసి పేజీ ఓపెన్ చేయాలి.. అందులో లాగిన్, రిజిస్టర్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను అందులో ఎంటర్ చేయాలి.

మొబైల్ నంబర్ టైప్ చేసి ‘Get OTP’పై క్లిక్ చేశాక.. మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌చేసి ‘VERIFY’ మీద క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్ వెరిఫై అయిన తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఫోటో ఐడీ ఫ్రూఫ్ (గుర్తింపు కార్డు), ఐడీ నంబర్, పేరు ఇతర వివరాలను నమోదు చేయాల్సిందిగా సూచిస్తుంది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం.. కిందివాటిలో దేన్నయినా గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి.

కరోనా వ్యాక్సిన్ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులు:

1) ఆధార్ కార్డు

2) డ్రైవింగ్ లైసెన్స్

3) పాన్ కార్డు

4) పాస్‌పోర్టు

5) పెన్షన్ పాస్ బుక్

6) NPR స్మార్ట్ కార్డు

7) ఓటర్ ఐడీ

గుర్తింపు కార్డును ఎంచుకున్న తర్వాత దాని నంబర్‌ను ఎంటర్ చేయాలి (ఆధార్ అయితే.. 12 డిజిట్స్ ఆధార్ నంబర్ టైప్ చేయాలి). ఎంపిక చేసుకున్న ఐడెంటిటీ కార్డు మీద ఉన్న ప్రకారం.. మీ పేరును నమోదు చేయాలి. ఆ తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పుట్టిన సంవత్సరం (ఇయర్ ఆఫ్ బర్త్) ఎంటర్ (ఐడెంటిటీ కార్డు మీద ఉన్న ప్రకారం) చేయాలి. ఈ వివరాలన్నింటినీ కరెక్టుగా ఎంటర్ చేసిన తర్వాత ‘REGISTER’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.

మీ వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత మీ వివరాలు కనిపిస్తాయి. అందులో స్టేటస్ (Status) ఆప్షన్ వద్దకు వెళ్లి క్లిక్ చేయాలి. Schedule Oppointment for Vaccination పై క్లిక్ చేయాలి. అక్కడ తొలుత రాష్ట్రం పేరును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత జిల్లా, బ్లాక్, పిన్ కోడ్‌లను ఎంపిక చేసుకోవాలి. ఈ వివరాలను ఎంపిక చేసుకొని ‘Search’ చేస్తే.. మీకు సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ఒక వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.

ఈనెల 29 నుంచి మే 3వ తేదీ వరకూ రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్‌, కరోనా నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకున్న గోవా ప్రభుత్వం, గోవాలో ప్రతిరోజూ 2,000కు పైగా కోవిడ్ కేసులు నమోదు

ఎంపిక చేసుకున్న వ్యాక్సిన్ కేంద్రంపై క్లిక్ చేసి, స్క్రోల్ చేస్తే.. ఆ వ్యాక్సిన్ కేంద్రంలో ఏ రోజు, ఎన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయో వివరాలు కనిపిస్తాయి. మీ వీలును బట్టి వాటిలో నుంచి తేదీని ఎంపిక చేసుకోవాలి. ఉదయమా, సాయంత్రమా అనే వివరాలను ఎంచుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ‘CONFIRM’ పై క్లిక్ చేయాలి. వ్యాక్సిన్ కోసం అపాయింట్‌మెంట్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ వివరాలు మీకు అక్కడ డిస్‌ప్లే అవుతాయి. మీరు ఎంపిక చేసుకున్న సమయానికి వ్యాక్సినేషన్ సెంటర్ వద్దకు రావాలి. మీతో పాటు తప్పనిసరిగా గుర్తింపు కార్డు (రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న ఐడెంటిటీ కార్డు) తెచ్చుకోవాలి.

60 ఏళ్ల పైబడిన వారైతే ఆధార్ తదితర ఐడెంటిటీ కార్డు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో (Comorbidities) బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వారు వ్యాధులకు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాలి. రిజిస్టర్ కోసం ఉపయోగించిన ఫోన్ నంబర్‌ను తదుపరి ప్రక్రియల (సెకండ్ డోసు, కుటుంబసభ్యుల వ్యాక్సినేషన్ తదితరాలు) కోసం లాగిన్ నంబర్ (Login)గా ఉపయోగించుకోవచ్చు.

ఒక ఫోన్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు Add More ఆప్షన్ ద్వారా మరో నలుగురికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే వారందరికీ విడిగా ఐడెంటిటీ కార్డులతో కూడిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చినప్పుడు ఎవరికి వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన గుర్తింపు కార్డు తీసుకురావాలి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీ వివరాలను లాక్ చేసి ఉంచుతారు. ఆ తర్వాత సెకండ్ డోసు, ఇతర వివరాల కోసమే ఎడిట్ ఆప్షన్‌ను ఇస్తారు.

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌లో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1075 కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now