New Delhi, April 28: కరోనావైరస్ టీకా రిజిస్ట్రేషన్లు కోసం ఏర్పాటు చేసిన కొవిన్ సైట్‌లో (CoWIN Portal) సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. కొవిన్ సైట్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన కొద్దిసేపటికే కొవిన్ సైట్, ఆరోగ్యసేతు యాప్‌ల సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఓటీపీలు ఆలస్యంగా వస్తున్నాయని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సర్వర్లు క్రాష్ (CoWIN Portal Crashed) అయి రిజిస్ర్టేషన్ల ప్రక్రియకు అంతరాయం కలిగింది.
కాగా 18 ఏండ్లు పైబడిన వారికి టీకాల కోసం ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. కొవిన్, ఆరోగ్యసేతు, ఉమాంగ్ యాప్‌లలో రిజిస్ర్టేషన్లు ప్రారంభమయ్యాయి. మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో లాగిన్ కావడానికి ప్రయత్నించగా, సర్వర్ క్రాష్(CoWIN server is facing issues) అయ్యింది. అయితే సర్వర్లు క్రాష్ అవుతున్నాయని వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు లాగిన్ కావడానికి అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్(OTP) కూడా రావడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Here's Tweet Updates
CoWIN server is facing issue.... What the hell! They can't have infra to support their own people....
And they call them IT Super Power, what a shame 😭
— Pulak (@pulakB) April 28, 2021
Neither #Cowin or #AarogyaSetu are accepting #registration for 18+ for the #COVIDVaccination. We can't even handle a web rollout at scale. Forget #LargestVaccineDrive#LargestVaccineDrive pic.twitter.com/nZkY3PFVQ4
— Rahul Punga (@RaHuLpUnGa) April 28, 2021
Since last 3 days getting this error while trying to register for vaccination. Neither getting OTP SMS nor this portal for registration is functioning. Hope before too late I will get chance of vaccination at least.#CoronavirusVaccine #COVID19Vaccine #COVIDVaccination pic.twitter.com/xUb9c4xSdH
— Kalamanik (@KalamanikS) April 28, 2021
అధిక సర్వర్ లోడ్ కారణంగా సాయంత్రం 4 గంటలకు కోవిన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఒకేసారిగా అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఉదయం నుంచి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించిన వారికి, 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అన్న మెసేజ్ కనిపిస్తోంది.
Here's Update
When you are able to register for vaccination but all centers are 45+ only.#crashed #CoWin #CowinDown#cowincrashed #cowinregistration pic.twitter.com/Ls2eLQvnFe
— Rj Rajnish (@Rajnish99919327) April 28, 2021
"CoWIN Crashed," Complain Many As Vaccine Registration For 18+ Begins https://t.co/2VAQN6IL1l... pic.twitter.com/kY04W1iOyd
— newsflashhub (@newsflashhub) April 28, 2021
Cowin vaccination registration server crashed @rsprasad #Unite2FightCorona #cowinregistration #VaccineRegistration pic.twitter.com/qE0h2IDxnP
— Pawan Sharma (@iPawanSharma_) April 28, 2021
ఈ నేపథ్యంలో కేంద్రం ఓ ప్రకటన చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామని, సాయంత్రం 4 గంటల తరువాత రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయని పేర్కొంది. , కొవిన్ వెబ్ సైట్, ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ లలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, ఆపై వారికి దగ్గరలో ఉన్న టీకా కేంద్రాల నుంచి ఆపాయింట్ ఖరారవుతుందని కేంద్రం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇదిలావుండగా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే టీకాలను 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇవ్వరాదన్న ఆదేశాలు రాష్ట్రాలకు అందాయి. రాష్ట్రాలు, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు టీకాలను కొనుగోలు చేసి, వాటిని మూడవ దశ వ్యాక్సినేషన్ లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి అందిచవచ్చని తెలిపింది. 18 సంవత్సరాలు దాటిన వారికి ముందస్తు నమోదు మాత్రమే ఉంటుందని, వారికి వాక్సిన్ రిజిస్ట్రేషన్ ఉండబోదని స్పష్టం చేసింది.
కొవిన్ వెబ్‌సైట్‌లో టీకా కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం..
ముందుగా కొవిన్ పోర్టల్ (cowin.gov.in ) ఓపెన్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి. తరువాత రిజిస్ట్రేషన్ ఫర్ వ్యాక్సినేషన్ అని పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఫొటో గుర్తింపు కార్డును ఎంచుకుని దాని నంబర్‌తో పాటు పేరు, పుట్టిన సంవత్సరం వంటి వివరాలను నమోదు చేయాలి.
ఏ గుర్తింపు కార్డులో ఉన్నట్లు వివరాలు నమోదు చేశారో ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ అనంతరం ఏ రోజు టీకా వేయించుకోవాలో అందులో షెడ్యూల్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా షెడ్యూల్ బటన్‌పై క్లిక్ చేయాలి. అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే.. అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫార్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. తరువాత వ్యాక్సినేషన్ కేంద్రం ఎంచుకోవాలి. అది ప్రైవేట్ లేదా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రం ద్వారా టీకా తీసుకోవచ్చు.
కాగా ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఏదైతే గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేశారో ఆ వివరాలతో వ్యాక్సినేషన్ కేంద్రానికి మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి వెళ్లాలి. అలాగే షెడ్యూల్ తేదీలను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది. కొవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.