World Health Organization (File Photo)

Washington, April 28: ఇండియాలోలో ఉత్పరివర్తనం చెందిన కరోనా బి.1.617 వైరస్‌ రకం (B1617 Variant) ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన డబుల్ మ్యూటెంట్ కోవిడ్ వేరియంట్ ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ (WHO) పేర్కొంది.

బి.1.617 అనగా జంట ఉత్పరివర్తనాల వైరస్ రకం. తొలిసారిగా ఇది భారత్‌లో బయటపడగా.. యూకే, సింగపూర్‌ సహా పలు దేశాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తన వీక్లీ అప్‌డేట్‌లో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాణాంతకం అని ప్రటించలేమని పేర్కొంది.

అయితే ఇతర రకాల వైరస్‌లతో పోలిస్తే ఈ రకం వైరస్ వేగంగా వ్యాప్తి (Coronavirus Catastrophe) చెందుతోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో బి.1.617 రకానిదే కీలక పాత్ర అయి ఉంటుందని అంచనా వేస్తోంది. అయితే దీంతో పాటు వైరస్‌ ఉద్ధృతికి ఇతర కారణాలూ ఉన్నాయని చెప్పింది. ఆరోగ్య ప్రమాణాల పట్ల ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం.. జన సమూహాలు, నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల కేసులు అమాంతం పెరిగాయని తెలిపింది.

తుమ్మినా, దగ్గినా కరోనా, గాలి నుంచి వేగంగా శరీరంలోకి, ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, బ్రిటన్‌కు పాకిన ఇండియా డబుల్ మ్యూటెంట్ వైరస్

ఇదిలా ఉండగా.. భారత్‌లో వెలుగుచూసిన వైరస్‌ కొత్తరకం (New Coronavirus Variant) ప్రాణాంతకం అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. బి.1.617 రకం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవని నేషనల్‌ సెంటర్ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ హెడ్‌ సౌమిత్ర దాస్‌ తెలిపారు. అంతేగాక, ఈ రకం వైరస్‌పై (India Coronavirus Variant) భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ తెలిపింది.

ఇండియాలో కరోనా కల్లోలం..అండగా ఉంటామని తెలిపిన ప్రపంచ దేశాలు, భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటున్న డ‌బ్ల్యూహెచ్ఓ, భారత్‌కు అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందించ‌నున్న‌ట్లు తెలిపిన అమెరికా

ప్రపంచవ్యాప్తంగా, కొత్త కోవిడ్ -19 కేసులు వరుసగా తొమ్మిదవ వారంలో పెరిగాయి, గత వారంలో దాదాపు 5.7 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి - మునుపటి గణాంకాలను అధిగమించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. గత వారంలో నమోదైన ప్రపంచ కేసుల్లో 38 శాతం భారతదేశమేనని ఆ నివేదిక పేర్కొంది. B1617 వేరియంట్‌ను WHO 'ఆందోళనకర వేరియంట్'కు బదులుగా' ఆసక్తికర వేరియంట్ 'గా పరిగణించింది. ఏదేమైనా, కోవిడ్ -19 యొక్క బ్రిటిష్, దక్షిణాఫ్రికా మరియు బ్రెజిలియన్ రకాలను "ఆందోళన యొక్క వైవిధ్యాలు" గా WHO వర్గీకరించింది.

కరోనా మళ్లీ కొత్త అవతారం, దేశంలో ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ట్రిపుల్ మ్యూటెంట్‌ గుర్తింపు, ఇప్పటికే వణికిస్తున్న డబుల్ మ్యూటెంట్‌

B1617 వేరియంట్ (India's Double Mutant COVID-19 Variant) మొట్టమొదట 2020 డిసెంబర్ 1 న భారతదేశంలో కనుగొనబడింది. ఇందులో రెండు వేర్వేరు వైరస్ వేరియంట్ల నుండి ఉత్పరివర్తనలు ఉన్నాయి. అవి E484Q మరియు L452R. దేశంలో కరోనావైరస్ యొక్క రెండవ మరియు భారీగా కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కొంతవరకు బాధ్యత వహిస్తుంది. భారతదేశంలో వరుసగా ఏడవ రోజు బుధవారం 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారత్‌లో రికార్డు స్థాయిలో 3,60,960 కేసులు, 3,293 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం బుధవారం ఉదయం విడుదల చేసింది.