Human Trafficking Victims: కువైట్‌లో అమ్మకానికి 200 మంది ఆంధ్ర అమ్మాయిలు, సంచలనం రేపుతున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్, రక్షించాలంటూ కేంద్ర మంత్రికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి

అయితే ఆయన ఈ మధ్య ఓ సంచలన ట్వీట్ చేశారు. కువైట్ లో 200మంది ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లుగా మహిళలు చెబుతున్న వీడియోను పోస్టు (Video) చేసిన విజయసాయి రెడ్డి, కువైట్ లో (Kuwait) చిక్కుకున్న ఏపీ అమ్మాయిల్ని రక్షించాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌ని కోరుతూ ట్వీట్ చేశారు.

Human Trafficking Victims (File Image-Photo Credit- PTI)

Amaravathi, January 25: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy V) ట్విట్టర్ (Twitter) ద్వారా ఎప్పుడూ ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ మధ్య ఓ సంచలన ట్వీట్ చేశారు. కువైట్ లో 200మంది ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లుగా మహిళలు చెబుతున్న వీడియోను పోస్టు (Video) చేసిన విజయసాయి రెడ్డి, కువైట్ లో (Kuwait) చిక్కుకున్న ఏపీ అమ్మాయిల్ని రక్షించాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌ని కోరుతూ ట్వీట్ చేశారు.

బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హ్యూమన్ ట్రాఫికింగ్‌లో (Human Trafficking) భాగంగా అక్రమ రవాణాకు గురైన దాదాపు 200 మంది యువతులు (Trafficking Victims) కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ (Indian Embassy in Kuwait) వద్ద చిక్కుకుపోయారని, వారికి కాపాడాలని కోరారు. వారిని తిరిగి దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ ట్వీటులో విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి బాధిత యువతుల వీడియోను తన ట్వీట్‌కు జోడించారు.

Here's Vijayasai Reddy V Tweet

విజయసాయి రెడ్డి పోస్టు చేసిన వీడియోలో బాధిత మహిళలు చెప్పిన దాని ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడి యువతులకు మాయ మాటలు చెప్పి కువైట్ పంపించారు. అతడి మాటల్ని నమ్మి కువైట్ వెళ్లిన మహిళలను సారా అనే మహిళ రిసీవ్ చేసుకొని.. వారిని అమ్మేస్తుందని వీడియోలో మహిళలు వెల్లడించారు.

టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఫైట్

ఇలా మోసపోయిన వారు నానా కష్టాలు పడి ఇండియన్ ఎంబసీ వద్దకు చేరుకొని.. వేరే వారి ఫోన్ నుంచి వీడియో రికార్డు చేసి విడుదల చెయ్యగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ ఆరోగ్యం బాగోలేదని.. తమను ఆదుకోవాలని వారు ఏపీ సీఎం జగన్‌ను వీడియోల కోరారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో వీడియోని పోస్టు చేశారు.

బాబుకు సలహాలిచ్చేది చిట్టినాయుడే అంటున్న విజయసాయి రెడ్డి

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.