protests-all-over-andhra-pradesh TDP-Jagan govt face off in AP over Capital row (photo-Twitter)

Amaravathi, January 25: ఏపీలో ఇప్పుడు రాజధాని మార్పు అంశం వేడిని రేకెత్తిస్తోంది. ఏపీ రాజధాని అంశం కాస్తా వైసీపీ టీడీపీ శ్రేణులు వార్ గా (YCRCP vs TDP)మారింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లు, ( There Capitals) సీఆర్డీఏ బిల్లును (CRDA Bill) శాసనమండలిలో టీడీపీ (TDP) అడ్డుకోవడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏకంగా శాసనమండలి రద్దు (AP Legislative Council) చేస్తామనే ప్రకటన దాకా వచ్చింది. వైసీపీ శ్రేణులు వికేంద్రీకరణ బిల్లుకు మద్ధతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు దీనికి భిన్నంగా అమరావతే రాజధాని కావాలంటే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి.

ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?

ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు రిలే దీక్ష శిబిరంపై అధికార వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అంతేకాకుండా, రిలే నిరాహారదీక్షకు కూడా నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

TDP vs YCP Fight On AP Capital

అలాగే, రిలే దీక్షలో కూర్చొన్న వారిపై కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. శిబిరం ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారు. శిబిరం ఎదుట మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేసి రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో... ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్

అది కాస్తా తోపులాటకు దారి తీయడంతో... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకూ నచ్చజెప్పి శాంతించారు.

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ

మూడు రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు.

AP Capital Fight

విశాఖపట్నం జిల్లాలో కూడా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. 15 నియోజకవర్గాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దిష్టిబొమ్మను నగరమంతా ఊరేగించి శవయాత్ర జరిపి దహనం చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దిష్టి బొమ్మను కూడా తగులబెట్టారు.

TDP vs YCP Fight On AP Capital

అమరావతి నుంచి రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే లాంగ్‌మార్చ్‌ను వాయిదా వేసుకున్నట్లు బీజేపీ నేత నాగభూషణం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

ఈ నేపథ్యంలో సోమవారం(జనవరి 27,2020) నిర్వహించనున్న కేబినెట్‌ భేటీపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఒకవేళ మండలి రద్దు చేయాలని జగన్‌ సర్కార్‌ భావిస్తే.. కేబినెట్‌ భేటీలో తీర్మానం చేసి.. ఆ వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించినా... శాసనమండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయించడంపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మండలి చైర్మన్, టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్న వైసీపీ ప్రభుత్వం... అసలు మండలి అవసరమా? అనే చర్చకు తెరలేపింది. దీనిపై సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ ప్రకటించడంతో... ఆ రోజే మండలి రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.