Hyderabad Encounter: దిశ నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు, ఏదైనా ఉంటే న్యాయ కమిషన్‌కు చెప్పుకోమన్న అత్యున్నత న్యాయస్థానం

పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అదేవిధంగా ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలు ఇవ్వాలని కోరుతూ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ బోబ్డే స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్‌ వేశామని ఈ సమయంలో పిటిషన్‌ను విచారించలేమని పేర్కొన్నారు.

Supreme Court of India |(Photo Credits: IANS)

New Delhi, Febuary 28: దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు (Supreme Court) పరిశీలించింది. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అదేవిధంగా ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలు ఇవ్వాలని కోరుతూ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ బోబ్డే స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్‌ వేశామని ఈ సమయంలో పిటిషన్‌ను విచారించలేమని పేర్కొన్నారు.

దిశ నిందితులు మొత్తం 9 మందిని అదే తరహాలో కాల్చివేశారు

కాగా న్యాయ విచారణ కమిషన్‌ను కలిసే స్వతంత్రత పిటిషనర్లకు ఇస్తున్నామన్నారు. ఏం చెప్పాలనుకున్నా న్యాయ కమిషన్‌కు చెప్పాల్సిందిగా సూచించారు. న్యాయం జరగలేదని భావిస్తే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సీజేఐ బాబ్డే (Chief Justice SA Bobde) తెలిపారు. సీజేఐ సూచనతో న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

హైదరాబాద్‌లో దిశ అత్యాచారం, హత్య కేసులో (Dsiha Rape Murder Case) నలుగురు నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టుఈ కీలక సూచన చేసింది. నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ వారి కుటుంబాలు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ పోలీసుల చర్య పట్ల దేశమంతటా హర్షాతిరేకాలు

ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అదే విధంగా ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలు ఇవ్వాలని కోరుతూ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. ధర్మాసనం దీనిని తిరస్కరించింది.

దిషా నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ నేతలు

గతేడాది నవంబరు నెలాఖరులో వెటర్నరీ డాక్టర్‌పై నలుగురు కామాంధులు అత్యాచారం చేసి, పెట్రోలు పోసి హత్య చేసిన సంగతి విదితమే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి.

మిస్టరీగా మారిన యువతి మర్డర్

ఈ క్రమంలోనే ఘటన జరిగిన కొద్ది రోజులకు నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్‌లో (Hyderabad Encounter) చనిపోయారు. సీన్ రీక్రియేట్ చేస్తుండగా వారు తమపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, అందుకే నలుగురిని ఎన్ కౌంటర్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.