India Global Week 2020: పెట్టుబడులకు తలుపులు తెరిచాం, భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోంది, ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020లో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020 (India Global Week 2020) ఈవెంట్లో ప్రధాని మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు. ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020 (Global Week India) సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచానికే ఆస్తి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు మందులు సమకూర్చుస్తున్న ఘనత భారత్‌దేనని అన్నారు.

PM Modi in India Global Week 2020 (Photo-ANI)

New Delhii, July 9: భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020 (India Global Week 2020) ఈవెంట్లో ప్రధాని మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు. ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020 (Global Week India) సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచానికే ఆస్తి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు మందులు సమకూర్చుస్తున్న ఘనత భారత్‌దేనని అన్నారు. భారత్‌లో రోజుకు 2.87లక్షల కొత్తకేసులు నమోదవుతాయంటున్న అధ్యయనం, మహారాష్ట్రలో మొత్తం 5,713 మంది పోలీసులకు కరోనా, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24,879 కోవిడ్-19 కేసులు

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ వైరస్‌పై ప్రపంచం సాగిస్తున్నపోరులో భారత్‌ భాగస్వామ్యం అయ్యిందన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి జరుగుతున్నఅంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత ఫార్మా సంస్థలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తయారీ భారత్‌ బాధ్యత అని ప్రపంచంలో 2/3వంతు చిన్నారులకు వ్యాక్సిన్‌ అవసరమని తెలిపారు. టీకాను కనుగొంటే దాని అభివృద్ధి, ఉత్పత్తిలో భారత్‌ పాత్ర క్రియాశీలకంగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. ఈపీఎఫ్‌ మీద కేంద్రం శుభవార్త, కేంద్రమే 3 నెలల పాటు పీఎఫ్‌ చెల్లిస్తుంది, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన మరో 5 నెలలు పొడిగింపు

భారత దేశంలో పెట్టుబడులు పెట్టి, తమ ఉనికిని చాటుకోడానికి గ్లోబల్ కంపెనీలకు రెడ్ కార్పెట్‌ పరుస్తూ స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు భారతదేశం అందించే ఈ అవకాశాలను చాలా కొద్ది దేశాలు మాత్రమే అందిస్తాయి. రక్షణ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అవకాశాలు వచ్చాయి.’’ అని ఆయన పేర్కొన్నారు.

భారత్ విజ్ఞానానికి అధికార కేంద్రమని, తమ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచేందుకు సదా సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. భారతీయలు సహజ సంస్కర్తలని, సాంఘికంగా గానీ, ఆర్థికంగా గానీ వచ్చే సవాళ్లను అధిగమించిన చరిత్ర తమకుందని ఆయన ప్రకటించారు. ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించిన చరిత్ర భారత్‌కు ఉందన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో భారత్‌ అసమాన పోరాటం చేస్తోందని, ప్రజా ఆరోగ్య సంరక్షణతోపాటు ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ సాధనకు కృషి చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.

భారత్ ఓ పక్క కరోనా మహమ్మారితో పోరాడుతూనే... మరోపక్క ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతోందని, ఆరోగ్యం, ఆర్థికం రెండింటీపై ఫోకస్ పెట్టామని మోదీ తెలిపారు. భారతదేశానికి చెందిన టెకీలు కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచానికి మార్గం చూపిస్తూనే ఉన్నారని, అలాంటి వారిని ఎవరు, ఎలా మరిచిపోగలరని ప్రశంసించారు. పునరుజ్జీవన భారతదేశం మరియు కొత్త ప్రపంచం’ నినాదంతో ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020 సమావేశాలు నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది ఇందులో పాల్గొనున్నారు. 75 సెషన్లలో 30 దేశాలకు చెందిన 250మంది ప్రపంచ ప్రతినిధులు ప్రసంగించనున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif