Union Minister Prakash Javadekar. (Photo Credits: IANS)

New Delhi, July 9: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)పై (Cabinet Extends EPF Support) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ (Cabinet)బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా 72లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. భారత్‌లో రోజుకు 2.87లక్షల కొత్తకేసులు నమోదవుతాయంటున్న అధ్యయనం, మహారాష్ట్రలో మొత్తం 5,713 మంది పోలీసులకు కరోనా, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24,879 కోవిడ్-19 కేసులు

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (Pradhan Mantri Garib Kalyan Yojana), ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఈ జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు ఈపీఎఫ్‌ (EPF) కంట్రిబ్యూషన్‌ 24శాతం (12 శాతం ఉద్యోగుల వాటా, 12 శాతం యజమానుల వాటా) పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు.

అయితే వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులు, ఉద్యోగులు, యజమానుల వాటా పీఎఫ్‌ను కేంద్రం మూడు నెలల పాటు చెల్లిస్తుందన్నారు. ఈ చర్యతో 72 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగిందని జవదేకర్ తెలిపారు. దీంతో పాటుగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో ఐదు నెలల పాటు పొడిగించేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. ఎట్టకేలకు యూపీ క్రిమినెల్ గార్డుకు చిక్కాడు, గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేను ఉజ్జెయినిలో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పటికే న‌లుగురు క్రిమిన‌ల్స్‌ ఎన్‌కౌంట‌ర్

దీంట్లో 81 కోట్ల మందికి 203 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నవంబర్‌ వరకు కేటాయించనున్నట్లు చెప్పారు. గత మూడు నెలల్లో 120 లక్షల టన్నులు పంపిణీ చేశామని చెప్పారు. గతంలో నాలుగు 4.60లక్షల టన్నుల పప్పు ఇవ్వగా, ఇప్పుడు 9.70లక్షల టన్నులు ఇవ్వనున్నట్లు వివరించారు.