Coronavirus in India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 1,65,553 మందికి కోవిడ్, 3,460 మంది మృతితో 3,25,972 కు పెరిగిన మరణాల సంఖ్య, ఇప్పటి వరకు 21 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు తెలిపిన కేంద్రం

వాటి ప్రకారం... నిన్న 2,76,309 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,94,800కు (Coronavirus in India) చేరింది. మరో 3,460 మంది క‌రోనాతో ప్రాణాలు (Coronavirus Deaths) కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,25,972 కు పెరిగింది.

COVID Outbreak - Representational Image (Photo-PTI)

New Delhi, May 30: దేశంలో నిన్న 1,65,553 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న 2,76,309 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,94,800కు (Coronavirus in India) చేరింది. మరో 3,460 మంది క‌రోనాతో ప్రాణాలు (Coronavirus Deaths) కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,25,972 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,54,54,320 మంది కోలుకున్నారు. 21,14,508 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,20,66,614 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,31,83,748 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,63,839 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

చైనాపై మళ్లీ కొత్త కరోనా వేరియంట్ దాడి, తాజాగా 20 కోవిడ్ కేసులు నమోదు, గాంజావ్‌ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్, వియత్నాంలో కొత్తగా హైబ్రిడ్‌ మ్యూటెంట్‌ వెలుగులోకి, అక్కడ రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త సంకర జాతి కరోనా వైరస్‌

రోజువారీ పాజిటివిటీ రేటు వరుసగా 6వ రోజు 10%లోపు నమోదైంది. ఒక్క రోజులో 2,76,309 మంది కోలుకోగా రివకరీ రేటు 91.25%కి పెరిగింది. క్రియాశీలక కేసుల సంఖ్య మరింత తగ్గి 21,14,508 (7.58%)కి చేరింది. దేశవ్యాప్తంగా శనివారం 20,63,839 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఇంతవరకు జరిపిన పరీక్షల సంఖ్య 34.31 కోట్లు దాటింది. దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి 21,20,66,614 కొవిడ్‌ టీకా డోసులు వేశారు. గత 24 గంటల్లో 30,35,749 టీకాలు పంపిణీ చేశారు. అలాగే మరణాల రేటు 1.17 శాతంగా ఉంది. రోజువారీ మరణాలు గత ఐదు రోజుల కంటే తక్కువ నమోదయ్యాయి.

ముత్యాలగూడెంలో కొంపముంచిన పెళ్లి వేడుక, హాజరైన వంద మందికి కరోనా, నలుగురు మృతి, మరో జిల్లా నల్లగొండలో ధోవతి ఫంక్షన్‌‌లో పది మందికి సోకిన కరోనా

దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 21 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం నాటికి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 134వ రోజుకు చేరగా.. ఒకే రోజు 28,09,436 టీకాలు వేసినట్లు పేర్కొంది. ఇందులో 25,11,052 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 2,98,384 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. 18-44 సంవత్సరాల మధ్య వయస్సున్న 14,15,190 మందికి మొదటి మోతాదు, మరో 9,075 మందికి రెండో మోతాదు అందజేసినట్లు తెలిపింది.

ఒకే వ్యక్తిపై మూడు ఫంగస్‌లు దాడి, రక్తం విషంగా మారడంతో న్యాయవాది కున్వర్ సింగ్ మృతి, ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన

మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నుంచి దేశవ్యాప్తంగా 1,82,25,509 మందికి మొదటి మోతాదు అందిందని చెప్పింది. బిహార్‌, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో 18-44 వయస్సున్న వారికి పదిలక్షలకుపైగా వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది. సాయంత్రం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు దేశంలో మొత్తం 21,18,39,768 మోతాదులు అందించినట్లు చెప్పింది.