Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

Lucknow, May 29: దేశంలో కరోనావైరస్ రోగులపై ఫంగస్ దాడి చేస్తోంది.అయితే ఇప్పటిదాకా కోరిడ్ రోగులపై ఏదైనా ఒక ఫంగస్ దాడి చేయగా ఒప్పుడు ఒకేసారి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లు ఓ వ్యక్తిపై దాడి చేశాయి. దీంతో అతని రక్తం విషంగా మారి (Ghaziabad man dies with yellow, black and white fungus ) కన్నుమూశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకెళితే.. ఘజియాబాద్ కు చెందిన కున్వర్ సింగ్ అనే న్యాయవాది ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేరగా, ఆయనకు ఎండోస్కోపీ నిర్వహించారు. ఎండోస్కోపీలో దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది. కున్వర్ లాల్ శరీరంలో మూడు ఫంగస్ లను గుర్తించారు. వైద్యులు చేసిన చికిత్స కూడా ఫలించలేదు. ఫంగస్ ల కారణంగా రక్తం విషపూరితంగా మారడంతో గత రాత్రి (Ghaziabad man dies) మరణించాడు.

ఆయనకు చికిత్స చేసిన ENT డాక్టర్ బిపి త్యాగి ప్రకారం..యూపీలో 59 ఏళ్ల కోవిడ్ -19 రోగి న్యాయవాది కున్వర్ సింగ్ కరోనాతో రాజ్ నగర్ ప్రాంతంలోని హర్ష్ ఆసుపత్రిలో చేరాడు. అయితే శుక్రవారం రాత్రి 7.30 గంటలకు టాక్సేమియా (టాక్సిన్స్ ద్వారా రక్త విషం) కారణంగా (Kunwar Singh Dies) కన్నుమూశారు. మే 24 న ఎండోస్కోపీ సమయంలో తెలుపు మరియు నలుపు ఫంగస్‌తో పాటు పసుపు ఫంగస్ కూడా ఆయన శరీరరంలో కనుగొనబడింది" అని త్యాగి తెలిపారు.

చైనాపై మళ్లీ కొత్త కరోనా వేరియంట్ దాడి, తాజాగా 20 కోవిడ్ కేసులు నమోదు, గాంజావ్‌ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్, వియత్నాంలో కొత్తగా హైబ్రిడ్‌ మ్యూటెంట్‌ వెలుగులోకి, అక్కడ రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త సంకర జాతి కరోనా వైరస్‌

ఇదిలా ఉంటే డాక్టర్ సొంత ఆసుపత్రిలో మురాద్‌నగర్‌కు చెందిన మరో 59 ఏళ్ల వ్యక్తికి చికిత్స చేస్తోందని ఆయనలో పసుపు ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌ కూడా గుర్తించామని చెప్పారు. అతని మెదడు సమీపంలో ఈ ఫంగస్ కనుగొన్నామని తెలిపారు. అతని దవడలో సగం తొలగించబడిందని అన్నారు.అతనికి కూడా టాక్సేమియా ఉన్నప్పటికీ కున్వర్ సింగ్ కంటే ఇన్ఫెక్షన్ స్థాయి తక్కువగా ఉండటంతో కొంచెం కోలుకుంటున్నాడని తెలిపారు.