India Covid Updates: తెలంగాణలో 18 మందికి యుకె కరోనా స్ట్రెయిన్, రాఫ్ట్రంలో తాజాగా 111 మందికి కరోనా, ఏపీలో 136 కొత్త కేసులు, దేశంలో తాజాగా 18,599 మందికి కరోనా పాజిటివ్, తమిళనాడు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు.

Coronavirus (Photo Credits: IANS)

New Delhi, Mar 8: భార‌త్‌లో గత 24 గంటల్లో 18,599 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను (India Covid Updates) కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 14,278 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,29,398కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 97 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,853కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,82,798 మంది కోలుకున్నారు. 1,88,747 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,19,68,271 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,37,764 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తెలంగాణలో కొత్త‌గా 111 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 189 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,011కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,562 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,642 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,807 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 689 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

చైనా వివాదాస్పద నిర్ణయం, కోవిడ్ పరీక్షల్లో భాగంగా మలద్వారం శుభ్రం చేసే టెస్ట్, విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు, చర్యను ఖండిస్తున్న పొరుగు దేశాలు

ఏపీలో గడచిన 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు నిర్వహించగా 136 కొత్త కేసులు (AP Coronavirus) వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 49 మందికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 12, కడప జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 11 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక కేసు నమోదైంది.

అదే సమయంలో 58 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,520 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 998గా నమోదైంది. మొత్తం మరణాల సంఖ్య 7,174కి చేరింది.

కొత్త వేరియంట్లతో 4వ వేవ్ ముప్పు, అమెరికాలో సగటున రోజూ 2 వేల మంది దాకా చనిపోతున్నారంటూ హెచ్చరికలు జారీ చేసిన సీడీసీ, అమెరికాను వణికిస్తున్న B.1.1.7 వేరియంట్

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమై, రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (Tamil nadu Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరు తమ రాష్ట్రానికి వచ్చినా ముందుగా ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ-పాస్ తీసుకోవడం తప్పనిసరని ప్రకటించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

కేరళ సహా దేశంలోని ఇంకే ప్రాంతం నుంచి వచ్చే వారైనా, విదేశాల నుంచి వచ్చే వారైనా ఈ-పాస్ పొందాల్సిందేనని స్పష్టం చేసింది. వేరే ప్రాంతాల నుంచి వస్తున్న వారి కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే వారు ముందుగానే కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ను జత పరుస్తూ, అనుమతి తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిలో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా (UK covid Strain) ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు. ఈ పరీక్షల్లో బ్రిటన్‌ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనూ బ్రిటన్‌ స్ట్రెయిన్‌ ఉన్నట్లు గుర్తించారు. జనవరి 10వ తేదీ నుంచి ఇప్పటివరకు బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిని, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 15 దేశాల నుంచి వచ్చినవారినీ కలిపితే మొత్తం 20 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగారు.

మరో కొత్త షాక్, డిసెంబర్‌కు ముందే చైనాలో కరోనా, వుహాన్‌లో 13 రకాల కోవిడ్ స్ట్రెయిన్లు, SARS-COV-2కు సంబంధించి 13 ర‌కాల జ‌న్యు క్ర‌మాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ

వీరంతా విదేశాల్లోనే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని వచ్చినప్పటికీ... ఇక్కడ దిగాక కొందరిలో లక్షణాలు కనపడటంతో మళ్లీ టెస్టులు నిర్వహించారు. వీరిలో దాదాపు 200 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయా శాంపిళ్లను సీసీఎంబీకి పంపగా, అందులో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ ఉన్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. ఇలా వివిధ దేశాల నుంచి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ రాష్ట్రంలోకి వస్తుండటంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. తప్పుడు చిరునామా, ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం వల్ల ఇద్దరికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వచ్చి నా... వారిని పట్టుకోవడం అధికారులకు సవాల్‌గా మారింది.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్