Coronavirus in India: కరోనా సెకండ్ వేవ్‌తో భయమేమి లేదు, దేశంలో తాజాగా 74,383 మందికి కరోనా, 70,53,807 కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య, 1,08,334 కు పెరిగిన కరోనావైరస్ మరణాల సంఖ్య
మొత్తం కేసుల సంఖ్య 70,53,807 కు చేరింది. కోవిడ్ వైరస్ (Coronavirus Cases in India) బాధితుల్లో తాజాగా 918 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,08,334 కు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,154 మంది వైరస్ రోగులు కోలుకున్నారు.
New Delhi, Oct 11: భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 74,383 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 70,53,807 కు చేరింది. కోవిడ్ వైరస్ (Coronavirus Cases in India) బాధితుల్లో తాజాగా 918 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,08,334 కు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,154 మంది వైరస్ రోగులు కోలుకున్నారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 60,77,976. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 8,67,496. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
దేశంలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 86.17 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు12.30 శాతం ఉన్నాయని వెల్లడించింది. మరణాల రేటు 1.54 శాతానికి తగ్గిందని పేర్కొంది. శనివారం ఒక్కరోజే 10,78,544 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి 8,68,77,242 నమూనాలు పరీక్షించామని తెలిపింది.
దేశంలో ఈ మధ్య ఎక్కువగా సెకండ్ వేవ్ గురించి ఆలోచన జరుగుతోంది. ప్రపంచ దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైందని అది ఇండియాకు కూడా వస్తుందని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే సెకండ్ వేవ్ అంత ప్రమాదకరం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతా కరోనా నుంచి బయటపడే దిశగానే సాగుతోందని వేస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం కరోనాపై ప్రజల్లో అవగాహన మరింతగా పెరిగింది. మాస్కులు, శానిటైజర్లు పెట్టుకుని బయటకు వెళుతున్నారు. పల్స్ ఆక్సీమీటర్ ఇంట్లో నే పెట్టుకుని తరచూ ఆక్సిజన్ పర్సంటేజ్ చూసుకోవడం తెలిసింది. ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుండడంతో వైరస్ వ్యాప్తి వేగం తగ్గింది. అలాగే కరోనాకు ఏం చికిత్స్ చేయాలో డాక్టర్లు కూడా తెలుసుకున్నారు, దీనివల్ల బారీ స్థాయిలో మరణాల రేటు కూడా తగ్గింది.
కేసుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వైర్‌సను నిరోధించే యాంటీబాడీస్ ఉన్నవారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల.. వారి నుంచి ఇతరులకు వైరస్ సోకే ముప్పు తగ్గి, ఒక దశలో కేసుల సంఖ్య సహజంగానే తగ్గుతుంది. ప్రస్తుతం మన దేశంలో కేసుల సంఖ్య తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు.అలాగే రెమ్‌డెసివిర్, ఫావిపిరవిర్, డెక్సామెథసోన్, కార్టికోస్టిరాయిడ్‌లు.. వంటి ఔషధాలు చాలానే అందుబాటులోకి వచ్చాయి.
ఇక త్వరలో ఏడెనిమిది వ్యాక్సిన్లు మనకు అందుబాటులోకి వచ్చే దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం ఒక్క వ్యాక్సిన్ అయినా అందుబాటులోకి వస్తుందని అంచనా. బ్రిటన్ ఏకంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. భారత్ కూడా కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాకు నిపుణుల బృందాన్ని నియమించి, టీకాను భద్రపరిచేందుకు శీతలగిడ్డంగుల వేటలో పడింది. ఫార్మా, ఫుడ్‌ప్రాసెసింగ్, అగ్రో సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.