India Coronavirus: మాస్క్ ఉన్నా కరోనాతో డేంజరే, దేశంలో రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కేసులు నమోదు, 6,25,439కు చేరిన మొత్తం కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభిస్తున్నది .తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus cases) నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. అంతేకాకుండా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ మహమ్మారి కారణంగా 379 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 18,213కు చేరింది.

Coronavirus Outbreak in India | (Photo Credits: PTI)

New Delhi, July 3: దేశంలో మహమ్మారి కరోనా (coronavirus Pandemic) కల్లోలాన్ని రేపుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభిస్తున్నది .తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు (coronavirus cases) నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, 33 యుద్ధ విమానాలు కొనుగోలుకు భారత్ పచ్చజెండా, హోంమంత్రి లద్దాఖ్ పర్యటన రద్దు

దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. అంతేకాకుండా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ మహమ్మారి కారణంగా 379 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 18,213కు చేరింది.

ఇక దేశంలో ఇప్పటివరకు 3,79,892 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 2,27,439 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54 వేల కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఏ దేశంలో కూడా నమోదు కాలేదని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. అనంతపురంలో ఒక్కరోజే 134 కరోనా కేసులు, ఏపీలో తాజాగా 845 కోవిడ్-19 కేసులు, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 9,32,713 పరీక్షలు నిర్వహణ, ఏపీలో 16097కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

దేశవ్యాప్తంగా గురువారం 2,41,576 మంది పరీక్షలు చేశామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. జూలై 2 వరకు మొత్తం 92,97,749 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా కేసులను పరిశీలిస్తే..

మహారాష్ట్ర- 1,86,626 కేసులు, 8178 మంది మృతి

తమిళనాడు- 98,392 కేసులు, 1321 మంది మృతి

ఢిల్లీ- 92,175 కేసులు, 2864 మంది మృతి

గుజరాత్‌- 33,913 కేసులు, 1886 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌- 24,825 కేసులు, 735 మంది మృతి

పశ్చిమబెంగాల్‌- 19,819 కేసులు, 699 మంది మృతి

రాజస్థాన్‌- 18,662 కేసులు, 430 మంది మృతి

తెలంగాణ- 18,570 కేసులు, 275 మంది మృతి

కర్ణాటక- 18,016 కేసులు, 272 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌- 16,097 కేసులు, 198 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ బాధితుల సంఖ్య కోటి దాటింది. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,85,656 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,24,088 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 61,40,827 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 28,37,189 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,31,485 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 11,91,091 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా విశ్వరూపం, ఒక్కరోజులోనే అత్యధికంగా 1200 పైగా మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ, 26 జిల్లాల నుంచి నమోదైన పాజిటివ్ కేసులు

ఇక కరోనా నుంచి రక్షించుకునేందుకు అందరూ మాస్కులు ఉపయోగిస్తున్నారు. అయితే అవి కూడా అంతగా రక్షించలేవని అమెరికా ప్రభుత్వ సెంటర్‌ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) ఓ నివేదికలో పేర్కొంది. మాస్క్ ధరించి ఎవరితోనైనా 4 నిమిషాల్లోపు మాట్లాడటం కాని వారితో పక్కన ఉండటం చేయాలి. ఆ సమయం దాటితే రిస్కులో పడ్డట్లేనని నివేదిక వెల్లడించింది. ఎవరైనా ఆరడుగుల దూరంలో ఉన్నా అది 45 నిమిషాల లోపే మనిషిని రక్షిస్తుంది. ఆ తర్వాత దాని ప్రభావం ప్రారంభమవుతుందని నివేదిక తెలిపింది.

బాగా వెలుతురున్న ప్రదేశాల్లో మనుషుల మధ్య దూరం పాటించడం వల్ల తక్కువ ప్రమాదమేనని, నిత్యావసరాలు, సరుకుల కొనుగోలుకు వెళ్లినపుడు మధ్యంతర ప్రమాదం (మీడియం రిస్క్‌), ఇండోర్‌ స్పేసెస్‌లో హైరిస్క్‌ పొంచి ఉన్నట్టుగా వివరించింది. పబ్లిక్‌ బాత్‌రూంలు, కామన్‌ ఏరియాల్లో కొంచెం రిస్క్‌ ఉంటుందని తెలిపింది. వైరస్‌ వ్యాప్తికి ఉపరితలాలు, బహిరంగ కార్యకలాపాలతో కరోనాతో రిస్క్ తక్కువగా ఉంటుందని అదే... ఏసీ షాపులు, ఆఫీసులు, స్కూళ్లు, వివిధ పని ప్రదేశాల్లో డిస్టెన్స్‌ పాటించినా రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

ఇటు బిజినెస్‌ నెట్‌ వర్కింగ్‌/కాన్ఫరెన్స్‌లు, పార్టీలు/పెళ్ళిళ్లు, కచెరీలు/సినిమా హాళ్లలో ‘హై రిస్క్‌’అవకాశాలున్నట్టుగా సీడీసీ నివేదికలో పేర్కొంది. అందువల్ల ఇంట్లో/బహిరంగ ప్రదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి తదనుగుణంగా మసలుకోవాలని స్పష్టం చేసింది. ప్రధానంగా ఇరుకుగా ఉన్న ప్రాంతాలు, బాగా వెలుతురున్న, విశాల ప్రాంతాలు, అధిక జనసమ్మర్థం, తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలను విభజించుకుంటూ దానికి అనుగుణంగా సమయాన్ని వెచ్చించాలని నివేదిక సూచించింది.