Amaravati. July 2: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 14,285 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 845 మంది పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus) అయ్యారు. ఇందులో రాష్ట్రంలో 812 కేసులు కాగా, 29 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి వైరస్ బారిన పడ్డ వారు నలుగురు. వైరస్ బారినపడి ఐదుగురు బాధితులు మృత్యువాత పడ్డారు. 281 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. వంద రోజులు, ఆరు లక్షలకు పైగా కేసులు, దేశంలో గత 24 గంటల్లో 17834 కోవిడ్-19 కేసులు, 434 మరణాలు, కరోనా కేసుల్లో రష్యాకు చేరువలో నిలిచిన భారత్
ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,32,713 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8586 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 16097 కేసులు (AP Corona Report) ఇప్పటివరకు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 6,04,641కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17,834కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,26,947 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Here's AP Corona Report
#COVIDUpdates: 02/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 13,625 పాజిటివ్ కేసు లకు గాను
*5868 మంది డిశ్చార్జ్ కాగా
*198 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/J6WIxspMj5
— ArogyaAndhra (@ArogyaAndhra) July 2, 2020
ప్రకాశం జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే అత్యధికంగా 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 477కి చేరుకుంది. బుధవారం కరోనాతో ఇద్దరు మృతి చెందగా చికిత్స అనంతరం కోలుకున్న 27 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒంగోలు శివారులో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. యరజర్ల కొండపై కరోనా మృతుల అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన అధికారులను సమీప గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. నిన్న అర్ధరాత్రి మృతదేహాల వాహనాలతో అధికారులు వచ్చారు. అది గమనించిన స్థానికులు ఆ వాహనాన్ని వెనక్కి పంపించారు. రాత్రంతా కాపలా ఉన్నారు. దీంతో గురువారం పోలీసులతో కలిసి మళ్లీ వాహనంతో అధికారులు వచ్చారు. మళ్లీ ప్రజలు అడ్డుకున్నారు.
1823 కేసులతో అనంతతపూర్ ఉండగా.. తర్వాత, ఈస్ట్ గోదావరి 1331, చిత్తూరు 1136, గుంటూరు 1530, కడప 1101,క్రిష్ణా 1594, కర్నూలు 2120, వెస్ట్ గోదావరి 1063 కేసులుతో దూసుకెళ్తున్నాయి.