IPL Auction 2025 Live

Coronavirus Outbreak in India: దేశంలో రోజు రొజుకు పెరుగుతున్న కరోనా మరణాలు, తాజాగా 3689 మంది మృతి, గత 24 గంటల్లో 3,92,488 మందికి కోవిడ్, 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నవారికి టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం

అయితే మరణాల సంఖ్య పెరిగింది. వరుసగా ఐదో రోజు మూడు వేలకుపైగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,92,488 కరోనా పాజిటివ్‌ కేసులు (India Coronaviurs) నమోదవగా, 3689 మంది మృతి (Covid Deaths) చెందారు.

Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

New Delhi, May 2: దేశంలో నిన్న 4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, ఇవాళ దానికంటే 10 వేలు తక్కువగా రికార్డయ్యాయి. అయితే మరణాల సంఖ్య పెరిగింది. వరుసగా ఐదో రోజు మూడు వేలకుపైగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,92,488 కరోనా పాజిటివ్‌ కేసులు (India Coronaviurs) నమోదవగా, 3689 మంది మృతి (Covid Deaths) చెందారు. ఇప్పటివరకు ఇంత భారీసంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,95,57,457కు చేరాయి.

ఇందులో 1,59,92,271 మంది కోలుకోగా, 33,49,644 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,15,542 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 3,07,865 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. అదేవిధంగా ఇప్పటివరకు 15,68,16,031 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా 63,282 నమోదవగా, కర్ణాటకలో 40,990, కేరళలో 35,636 రికార్డయ్యాయి. అదేవిధంగా మహారాష్ట్రలో 802, ఢిల్లీలో 412, ఉత్తరప్రదేశ్‌లో 303 మంది మృతిచెందారు.

కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి మే 1 వరకు 29,01,42,339 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 18,04,954 మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్‌లో దీదీ దూకుడు, గట్టి పోటీనిస్తున్న బీజేపీ, తమిళనాడులో దూసుకుపోతున్న స్టాలిన్, కేరళలో ముందంజలో అధికార పార్టీ, అసోంలో బీజేపీ ముందంజ, ప్రారంభమైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్

మే 1 నుంచి ఇండియాలో 18 నుంచి 44 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం, నిన్న దాదాపు 80 వేల మందికి పైగా టీకాలను అందించింది. శనివారం నాడు మొత్తం 84,599 మంది 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ తొలి డోస్ ను అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభమై శనివారం నాటికి 106 రోజులు కాగా, నిన్న 16,48,192 వ్యాక్సిన్ డోస్ లను ఇచ్చామని తెలిపింది. అందులో 9.89 లక్షల డోస్ లను తొలి డోస్ గా ఇచ్చామని, 6.58 లక్షల డోస్ లను సెకండ్ డోస్ గా ఇచ్చామని పేర్కొంది.

భారీ ఆధిక్యంలో వైసీపీ, వెనుకంజలో టీడీపీ, కనపడని బీజేపీ-జనసేన ప్రభావం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీదే ఆదిక్యం, నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న వైసీపీ హవా

ఇంతవరకూ ఇండియాలో 15.66 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిందని, ఇందులో 94.28 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లు తొలి డోస్ తీసుకోగా, 62.65 లక్షల మందికి రెండో డోస్ అందిందని, ఫ్రంట్ లైన్ వర్కర్లలో 1.26 కోట్ల మందికి తొలి డోస్ ను, అందులో 68.78 లక్షల మందికి సెకండ్ డోస్ ను ఇచ్చామని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఫ్రంట్ లైన్ వర్కర్లు, డాక్టర్లు, ఆర్మీ కేటగిరీలను మినహాయిస్తే, 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి 5.33 కోట్ల మందికి తొలి డోస్ ఇప్పటికే అందిందని, వారిలో 40 లక్షల మందికి రెండో డోస్ కూడా ఇచ్చామని వెల్లడించింది.

సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లీడ్, గట్టి పోటీనిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కనపడని బీజేపీ ప్రభావం, మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం

60 ఏళ్లు పైబడిన వారిలో 5.26 కోట్ల మందికి తొలి డోస్ ను ఇవ్వగా, వారిలో 1.14 కోట్ల మందికి రెండో డోస్ కూడా అందిందని కేంద్రం ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా దేశవాసులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, వ్యాక్సిన్ పంపిణీపై హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.