Hyderabad, May 2: నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Sagar Bypoll Result 2021) ఆదివారం ఉదయం 8 గంటకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. నాలుగో రౌండ్‌లో 3457 ఓట్ల ఆధిక్యంలో భగత్ ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్లు, మూడో రౌండ్‌లో 2,665 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి (TRS Party) అత్యధిక ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ (Congress) అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రెండు వేర్వేరు హాళ్లలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్‌ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్ పోటీ చేశారు.
కోవిడ్ నిబం ధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపులో పాల్గొనే 400 మంది సిబ్బందితో పాటు 300 మంది పోలీసులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నెగెటివ్ ఉంటేనే కౌంటింగ్ సెంటర్‌లోకి అనుమతిస్తామని ఈసీ ప్రకటించింది.