Coronavirus in India: కోటి మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, దేశంలో తాజాగా 19,078 మందికి కరోనా, 24 గంట‌ల్లో 224 మంది మృతి, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183

దేశ‌వ్యాప్తంగా 22,926 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. 24 గంట‌ల్లోనే 224 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే క‌రోనా కేసులు ఒక కోటి మూడు ల‌క్ష‌లు దాటింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183గా (COVID-19 Cases in India) ఉంది.

Coronavirus (Photo Credit: PTI)

New Delhi, January 2: భారతదేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 19,078 క‌రోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 22,926 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. 24 గంట‌ల్లోనే 224 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే క‌రోనా కేసులు ఒక కోటి మూడు ల‌క్ష‌లు దాటింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183గా (COVID-19 Cases in India) ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 99,06,387గా ఉంది. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 1,49,218కి చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.

కోవిడ్‌–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ (CDSCO) ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడానికి శుక్రవారం సిఫారసు చేసింది. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) దీనికి ఇంకా తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. నేడు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్‌కి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో)కి చెందిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (సీఎస్‌వో) వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులివ్వడానికి సిఫారసు చేసినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. 18 ఏళ్లు దాటిన వారికి 4– 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ ఇచ్చేలా సూచించినట్లు అధికారులు చెబుతున్నారు.

కోవిడ్ కల్లోలం, ఇండియాలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్, 30 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను సిద్ధం చేస్తోన్న సీరం, ఆందోళన రేపుతున్న కొత్త కరోనా వేరియంట్‌ స్ట్రెయిన్

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ 2న అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్‌ చేపడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చెక్‌లిస్టులు, ఎస్‌ఓపీలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే వ్యాక్సినేషన్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం జనవరి 6 నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు బ్రిటన్, అర్జెంటీనా తర్వాత అనుమతులు ఇచ్చిన మూడో దేశంగా భారత్‌ నిలుస్తోంది. రష్యా, బ్రిటన్, అమెరికా, కెనడా, చైనా, యూరోపియన్‌ యూనియన్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ మొదలైంది.

ఇండియాలో మరో నలుగురికి కొత్త వైరస్, 29కి చేరిన మొత్తం కొత్త కరోనావైరస్ కేసులు, ఢిల్లీలో 10, బెంగ‌ళూరులో 10, హైద‌రాబాద్‌లో 3, పుణెలో 5, బెంగాల్‌లోని క‌ళ్యాణిలో 1 కేసు న‌మోదు

డబ్ల్యూహెచ్‌వో గురువారం ఫైజర్‌ అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ అన్ని దేశాలు వారి పరిధిలో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులివ్వడం, టీకా డోసుల దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పింది. ఫైజర్‌ టీకా నాణ్యత, భద్రత అంశంలో ప్రమాణాలకు లోబడి ఉందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.