Covishield Gets Approval in India: కోవిడ్ కల్లోలం, ఇండియాలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్, 30 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను సిద్ధం చేస్తోన్న సీరం, ఆందోళన రేపుతున్న కొత్త కరోనా వేరియంట్‌ స్ట్రెయిన్‌
COVID-19 vaccine | Representational Image (Photo Credits: IANS)

New Delhi, January 1: దేశంలో కొత్త కరోనావైరస్ కల్లోలం రేపడం, పాత కరోనావైరస్ కేసులు నెమ్మదిగా పెరుగుతుండటంతో కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్‌ నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతి నిచ్చింది.సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు (Covishield Gets Approval in India) గ్రీన్ సిగ్నల్ లభించింది. పంపిణీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. త‌ద్వారా ఇండియాలో అనుమ‌తి పొందిన తొలి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌గా (AstraZeneca COVID-19 Vaccine) ఇది నిలిచింది.

ఇండియాలో సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) (ఎస్ఐఐ) కొవిషీల్డ్ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తోంది. దేశంలో పంపిణీకిగాను దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరమ్‌ 30 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను సిద్ధం చేస్తోంది. భారత్‌లో 10 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను వినియోగించను న్నామని సీరం ఇప్పటికే ప్రకటించింది.

మరో పక్క దేశంలో యూకేకు చెందిన కొత్త కరోనా వేరియంట్‌ స్ట్రెయిన్‌ ఉనికి ఆందోళన రేపుతోంది. తాజాగా నాలుగు కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కొత్త వైరస్ ‌బాధితుల సంఖ్య 29కి చేరింది. అటు కొత్త వేరియంట్‌ను కూడా ఎదుర్కొనే సామర్ధ్యం తమ టీకాకు ఉందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

ఇండియాలో మరో నలుగురికి కొత్త వైరస్, 29కి చేరిన మొత్తం కొత్త కరోనావైరస్ కేసులు, ఢిల్లీలో 10, బెంగ‌ళూరులో 10, హైద‌రాబాద్‌లో 3, పుణెలో 5, బెంగాల్‌లోని క‌ళ్యాణిలో 1 కేసు న‌మోదు

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం శనివారంనాడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 'డ్రై రన్' నిర్వహిస్తోంది. 'డ్రై రన్' సన్నద్ధతపై ఢిల్లీ ప్రభుత్వాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ శుక్రవారం సమీక్షా సమావేశం జరిపారు. వాక్సిన్ రిహార్సల్స్‌గా చెబుతున్న 'డ్రై రన్'ను అసోం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌లలో గత డిసెంబర్ 28, 29 తేదీల్లో నిర్వహించారు. తక్కిన రాష్ట్రాల్లో శనివారం ఈ డ్రై రన్ నిర్వహించనున్నారు.

కొత్త ఏడాదిలో కొత్త కరోనా కలవరం, ఫైజర్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ, దేశంలో తాజాగా 20,036 మందికి కరోనా, తెలంగాణలో 461 కొత్త కేసులు, ఏపీలో తాజాగా 338 మందికి కోవిడ్

హెల్త్ వర్కర్ల జాబితాను సిద్ధం చేసి కోవిడ్ ఫ్లాట్‌ఫాంపై అప్‌లోడ్ చేస్తామని, ఎన్నికల సమయంలో ఏ విధంగా సన్నాహాలు చేస్తామో, అదే పద్ధతిలో అన్ని వైద్య బృందాలకు బాధ్యతాయుతంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని హర్షవర్దన్ చెప్పారు. జాతీయ స్థాయిల్లో 2,000 మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 700కు పైగా జిల్లాల్లో శిక్షణ ఉంటుందని చెప్పారు.

ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో శిక్షణ ఏవిధంగా ఉంటుందో అదో విధంగా ఈ శిక్షణ కూడా ఉంటుందన్నారు. శనివారంనాడు డ్రై రన్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కనీసం మూడు సెషన్ సైట్స్ నిర్వహించడం జరుగుతుందని మంత్రి చెప్పారు.