Infosys Software Engineer Arrest: కరోనాపై చెత్త పోస్ట్, జైలుపాలయిన ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి, ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం, బెంగుళూరులో ఘటన
మరీ ముఖ్యంగా శరవేగంగా పెరుగుతున్నకరోనా(COVID-19) పాజిటివ్ కేసులతో కర్ణాటక రాష్ట్రం అల్లకల్లోలమవుతోంది. ఈనేపథ్యంలో అక్కడ కరోనాను విస్తరింపజేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కటకటాలను (Infosys Software Engineer Arrest) లెక్కిస్తున్నాడు. అంతేకాదు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు.
Bengaluru, March 28: ఒకవైపు ప్రపంచమంతా కరోనా (Coronavirus) కల్లోలంతో భయకంపితులవుతోంది. మరీ ముఖ్యంగా శరవేగంగా పెరుగుతున్నకరోనా(COVID-19) పాజిటివ్ కేసులతో కర్ణాటక రాష్ట్రం అల్లకల్లోలమవుతోంది. ఈనేపథ్యంలో అక్కడ కరోనాను విస్తరింపజేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కటకటాలను (Infosys Software Engineer Arrest) లెక్కిస్తున్నాడు. అంతేకాదు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు.
ఇది తాగితే కరోనావైరస్ చస్తుంది, ఇరాన్‌లో షికార్లు చేస్తున్న పుకార్లు
అతని పేరు ముజీబ్ మొహమ్మద్ (Mujeeb Mohammad). బెంగళూరులో ఇన్ఫోసిస్ సంస్థలో పని చేస్తున్నాడు. కరోనాను ఎలా కట్టడి చేయాలి? అనే విషయంపైనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే... ఇతను మాత్రం కరోనాను ఎలా వ్యాపింపజేయాలో సోషల్ మీడియాలో సూచనలు ఇచ్చాడు.
'అందరూ చేతులు కలపండి. బయటకు వచ్చి పబ్లిక్ ప్రదేశాల్లో తుమ్మండి. వైరస్ ను విస్తరింపజేయండి'. అంటే ఫేస్ బుక్ లో ప్రచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ, కరోనాను విస్తరింపజేయాలని కోరుతున్న ముజీబ్ ను కటకటాల వెనక్కి పంపించామని తెలిపారు.
అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు
ముజీబ్ వ్యవహారంపై ఇన్ఫోసిస్ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని... కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా ముజీబ్ వ్యవహరించాడని తెలిపింది. ఈ వ్యవహారంపై తాము అంతర్గత విచారణ జరిపామని... ఈ పనిని ముజీబ్ ఉద్దేశపూర్వకంగానే చేశాడని నిర్ధారించామని చెప్పింది. ఇన్ఫోసిన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముజీబ్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది.
Here's ANI Tweet
అంతేకాదు ఇలాంటి చర్యల్ని ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదన్న ఇన్ఫోసిస్ యాజమాన్యం ఇది అతను అనుకోకుండా చేసిన పొరపాటు కాదని, ఉద్దేశపూర్వంగానే ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని వివరించింది. కాగా కరోనాను విస్తరణను అడ్డుకునే క్రమంలో ఇన్ఫోసిస్ బీపీఎం, నాస్కామ్ సహకారంతో కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.
ముఖ్యంగా విదేశాలనుంచి తిరిగి వచ్చిన ప్రజలు పాటించాల్సిన స్వీయ-నిర్బంధ పద్ధతులు, పరీక్షా సౌకర్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనావైరస్ బారిన పడిన పౌరుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి, వైద్య సదుపాయాల విషయంలో అక్కడి ప్రభుత్వానికి మద్దతు నందిస్తోంది.