Jet Fuel Prices Hiked: చమురు సంస్థల షాక్, భారీగా పెరిగిన జెట్ ఇంధనం ధరలు, సామాన్యులకు విమాన ప్రయాణం ఇక భారమే
కోవిడ్ లాక్ డౌన్ లో భాగంగా పలుదేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గడంతో విమానయాన రంగం వేగం పుంజుకుంది.
Mumbai, Mar 16: కరోనావైరస్ రాకతో ఏవియేషన్ రంగం పూర్తిగా కుదేలైన సంగతి విదితమే. కోవిడ్ లాక్ డౌన్ లో భాగంగా పలుదేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గడంతో విమానయాన రంగం వేగం పుంజుకుంది. ఐతే తాజాగా చమురు సంస్థలు మరోసారి విమానయాన సంస్థలకు భారీ షాక్ ఇస్తూ జెట్ ఇంధనం(ఎయిర్ టర్బైన్ ఫ్యుయల్) ధరలను భారీగా (Jet Fuel Prices HIked) పెంచాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనంపై కిలోలీటర్‌కు రూ.17,136 చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ రూ.1.10 లక్షలకు చేరుకుంది. జెట్ ఇంధన ధరల పెరుగుదలతో (Aviation turbine fuel price hiked) ప్రయాణికులకు విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఆయా ఎయిర్‌లైన్ సంస్థలో ఇంధన నిర్వహణ వ్యయమే దాదాపు 40 శాతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధర అధికంగా ఉండడంతో ఈ ఏడాదిలో ఏటీఎఫ్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. ఇలా పెంచడం ఇది ఆరోసారి.
ఎటీఎఫ్ ధరలను పెరగడంతో విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. గత రెండు, నాలుగు వారాల్లో డొమెస్టిక్ విమాన ప్రయాణ ఛార్జీలు 15 నుంచి 30 శాతం మేర పెరిగాయి. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు పెంపులో ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ.36,644.25 చొప్పున పెరిగాయి. ఇక కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్ఞాలను కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గినట్లు తెలుస్తోంది.
2022 ప్రారంభం నుండి ప్రతి పక్షం రోజులకు ఒకసారి ATF ధరలు పెరిగాయి. జనవరి 1 నుండి ప్రారంభమయ్యే ఆరు పెంపులలో, ATF ధరలు ₹36,643.88 kl లేదా దాదాపు 50 శాతం పెరిగాయి. ATF కాకుండా, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు బుధవారం రికార్డు స్థాయిలో 132వ రోజు ఫ్రీజ్‌లో కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్లే, రోజువారీ ధరల సవరణ నవంబర్ 4, 2021న నిలిపివేయబడింది. వంట గ్యాస్ LPG ధరలు కూడా అక్టోబర్ నుండి ఫ్రీజ్‌లో ఉన్నాయి, అవి సిలిండర్‌కు ₹900కి చేరుకున్నాయి.