Karnataka Horror: తాగొచ్చి కొడుకును కొట్టిన తండ్రి, కోపం ఆపుకోలేక తండ్రిని 32 ముక్కలుగా నరికి వాటిని బోరు బావిలో పడేసిన కొడుకు, కర్ణాటక బాగల్‌కోట్‌లో దారుణ ఘటన

కర్ణాటక బాగల్‌కోట్‌లో శ్రద్ద వాకర్ హత్య తరహా లాంటి దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో సొంత కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు (son Chops Up Father's Body Into 32 Pieces) చేశాడు.

Murder (Photo Credits: Pixabay)

Bengaluru, Dec 13: కర్ణాటక బాగల్‌కోట్‌లో శ్రద్ద వాకర్ హత్య తరహా లాంటి దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో సొంత కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు (son Chops Up Father's Body Into 32 Pieces) చేశాడు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకొద్దని వాటిని తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో (Dumps In Borewell) పడేశాడు. డిసెంబర్ 6న ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడ్ని విఠల కులాలి(20)గా, అతని తండ్రి పేరు పరశురామ్ కులాలి(53)గా గుర్తించారు పోలీసులు.

మియాపూర్‌లో మరో దారుణం, మాట్లాడటం లేదని ప్రియురాలిని కత్తితో పొడిచిన యువకుడు, అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం

వారు తెలిపిన వివరాల ప్రకారం.. పరశురామ్ తాగుబోతు. రోజు ఫుల్లుగా మద్యం సేవించి కుమారుడ్ని తిట్టేవాడు. ఇతని బాధ భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు విఠల తండ్రితో పాటు ఉంటున్నాడు. పరశురామ్ రోజు తాగొచ్చి విఠల్‌ను దుర్భాషలాడేవాడు. కానీ, గత మంగళవారం తండ్రి తిట్లను భరించలేకపోయిన విఠల.. ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో పరశురామ్ చనిపోయాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు.ఈ శరీర భాగాలను తీసుకెళ్లి మంతూర్ బైపాస్ వద్ద తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు.

రూ.80 వేలా లేక ఇంకో కోణమా.. కొత్తగూడెం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య, గొంతు,చేతి,కాళ్ల నరాలు కట్ చేసిన కిరాతకులు, కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి విఠలను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బోరుబావి నుంచి పరశురామ్ శరీర భాగాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రొక్లేన్లతో తవ్వారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement