Karnataka: గీత గోవిందం సినిమా స్టైల్లో.. బస్సుల్లో నిద్రిస్తున్న యువతిని ముద్దుపెట్టుకున్న యువకుడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, నిందితుడుని పట్టుకునే పనిలో కర్ణాటక పోలీసులు
విజయ్ దేవరకొండ సినిమా గీత గోవిందం తరహాలో ముద్దు సీన్ జరిగింది. అయితే ఆ సినిమాలో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తూ కిస్ పెట్టగా ఈ స్టోరీలో యువకుడు కావాలని ఆ యువతికి ముద్దుపెట్టాడు.
Bengaluru, Sep 17: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ సినిమా గీత గోవీందం తరహాలో ముద్దు సీన్ జరిగింది. అయితే ఆ సినిమాలో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తూ కిస్ పెట్టగా ఈ స్టోరీలో యువకుడు కావాలని ఆ యువతికి ముద్దుపెట్టాడు. బస్సులో నిద్రిస్తున్న యువతిని అతను ముద్దు పెట్టుకుని (Youth Attempts 'Filmy Style Kiss) అశ్లీలంగా ప్రవర్తించాడు. బాధిత యువతి ఆర్కిటెక్చర్ విద్యార్థిని కాగా, బుధవారం రాత్రి 10:40కి బళ్లారిలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కింది.
గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదేపదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. మెలకువ వచ్చి చూస్తే ఎవరో గుర్తించలేక పోయింది. భయపడిన యువతి బస్సు దిగి పీణ్యా పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ( Girl Files Complaint) చేసింది. పోలీసులు యువకుని కోసం గాలింపు చేపట్టారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. బస్ డ్రైవర్, కండక్టర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నామని నిందితుడిని వీలయినంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.