IPL Auction 2025 Live

MHA Lockdown Rules Violation: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కేరళ సర్కారు, సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం, వెంటనే సడలింపులు ఉపసంహరణ

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా (MHA Lockdown Rules Violation) రెస్టారెంట్లు, బుక్‌ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది.

Kerala Chief Minister Pinarayi Vijayan (Photo Credits: ANI/File)

New Delhi, April 20: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను (Lockdown) సడలిస్తూ కేరళ ప్రభుత్వం (Kerala government) విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా (MHA Lockdown Rules Violation) రెస్టారెంట్లు, బుక్‌ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది. నేటి నుంచి అమలులోకి వచ్చిన లాక్డౌన్ యొక్క సడలింపులు

తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఏప్రిల్‌ 15,2020న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం ఉల్లంఘించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జారీ చేసిన నిబంధనలను పాటించకుండా కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వివిధ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినిస్తూ ఆదేశాలు ఇచ్చింది’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సీఎం పినరయి విజయన్‌ సర్కారు తీరును విమర్శించాయి.

ఇండియాలో 17 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 543 మంది మృతి

ఇక కేంద్రం లేఖపై స్పందించిన కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ మాట్లాడుతూ కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాం. అపార్థాలు చోటుచేసుకున్నందు వల్లే ఇలా జరిగింది. అందుకే కేంద్రం వివరణ కోరింది. ఇందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వివరణ ఇచ్చిన తర్వాత సమస్య సమసిపోతుంది. కేంద్ర నిబంధనలనే మేం కచ్చితంగా అమలు చేస్తున్నాం’’అని స్పష్టం చేశారు.

Ajay Bhalla's Letter:

కాగా లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్ ఏ, ఆరెంజ్‌ బీ, గ్రీన్‌ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

కాసర్‌గడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలను రెడ్‌ జోన్‌... పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్‌ ఏ జోన్‌... ఆరెంజ్‌ బీ జోన్‌లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్‌, వయనాడ్‌, త్రిసూర్ జిల్లాలు... కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్‌ జోన్‌ కింద పరిగణిస్తూ కొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చింది.

ఇక దేశంలో కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం ఉదయం హెచ్చరికలు జారీ చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, సామాజిక దూరం పాటించక పోవడం, నగరాల్లో వాహనాల్లో తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం శ్రమిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై దాడులకు దిగితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

ఇదిలా ఉంటే కేంద్రం సీరియస్ అయిన తరువాత కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఇచ్చిన సడలింపులను ఉపసంహరించుకుందని నివేదికలు సోమవారం తెలిపాయి. కేరళ ప్రభుత్వం బార్బర్ షాపులు మరియు రెస్టారెంట్లకు ఇచ్చిన రాయితీలను ఉపసంహరించుకుంది. ఈ విషయంపై చర్చించడానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం సమావేశం నిర్వహించిన తరువాత ఈ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.



సంబంధిత వార్తలు

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు

SC on Recruitment Rules for Govt Jobs: రిక్రూట్‌మెంట్‌ మధ్యలో రూల్స్ మార్చకూడదు, ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hyderabad: హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకు బైకుతో వెళితే జేబులు గుల్లే, నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో పలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కరవు మండలాల జాబితాను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 5 జిల్లాల్లో 54 కరువు మండలాలు