Lockdown 3.0: మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే
మే 4వ తేదీ నుంచి మే 17 వరకు రెండు వారాల పాటు లాక్‌డౌన్ (India lockdown) అమల్లో ఉండనుంది. రెండో దఫా లాక్‌డౌన్ గడువు మే 3తో ముగియనుండటంతో కేంద్ర హోంశాఖ (Home Ministry) లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.ఇక శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు.
New Delhi, May 1: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు (Lockdown 3.0) కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి మే 17 వరకు రెండు వారాల పాటు లాక్‌డౌన్ (India lockdown) అమల్లో ఉండనుంది. రెండో దఫా లాక్‌డౌన్ గడువు మే 3తో ముగియనుండటంతో కేంద్ర హోంశాఖ (Home Ministry) లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. దేశంలో తొలి రైలు కదిలింది, వలస కార్మికులతో లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్‌కు బయలు దేరిన ప్రత్యేక రైలు
లాక్‌డౌన్ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్‌డౌన్ రెండో దశ ఏప్రిల్ 1న ప్రారంభమై మే3 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ మూడో దశ మే 4 నుంచి మే 17 వరకు ప్రకటించింది. దీంతో మొత్తం 56 రోజులు భారత్‌లో లాక్‌డౌన్ విధించినట్టయింది. అయితే మూడో దశలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు ఇచ్చారు. ప్లాస్మా చికిత్స ఫెయిల్, మహారాష్ట్రలో తొలి మరణం నమోదు, ఐసీఎంఆర్ అనుమతి ప్రకారమే ప్లాస్మా చికిత్స చేశామన్న హారాష్ట్ర ఆరోగ్యశాఖ
కాగా దేశ వ్యాప్తంగా విమానాలు, రైళ్లు, మెట్రో సర్వీసులు, అంతర్ రాష్ట్రాల మధ్య రాకపోకలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు శిక్షణ, కోచింగ్ సంస్థలపై నిషేధం విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్, స్టేడియంలను మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని ప్రార్థనాస్థలాలు, పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేశారు. అన్ని జోన్లలోని ఆస్పత్రుల్లో ఓపీ సేవలకు అనుమతి ఇచ్చారు.
Here's the MHA order about coronavirus lockdown:
రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. సైకిళ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు, కటింగ్ షాపులపై నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితిని పరిశీలించనున్నారు. కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లగా మార్చనున్నారు. గుజరాత్ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం జగన్, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశాభావం
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. గ్రీన్ జోన్లలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇచ్చారు. కార్లలో ఇద్దరికి, టూ వీలర్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. భారీగా తగ్గిన ఎల్‌పిజి సిలిండర్ ధరలు, మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి, హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర 589.50 నుంచి ప్రారంభం
వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రోజుకు 400 రైళ్లు నడిపించేందుకు రైల్వేశాఖ సిద్ధం చేసింది. టికెట్ ఎంత అన్నది నిర్ణయించడానికి రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. అయితే రైళ్లలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా సామజిక దూరం పాటించేలా నిబంధనలు పాటించాలని సూచించింది. ప్రయాణికులకు మాస్కులు, శానిటైజర్లు, ఆహారాన్ని రైల్వేశాఖే అందించనుంది.
లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ‘శ్రామిక్ రైళ్ల’ను నడపనుంది. వీరి ఈ రైళ్లలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వలస కార్మికులతో పాటు విద్యార్థులు, వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఈ రైళ్లలో తమ సొంతూళ్లకు వెళ్లిపోవచ్చని కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల కోసం నోడల్ అధికారులను నియమిస్తుందని.. వీరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ వలస కార్మికులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తారని రైల్వే శాఖ తెలిపింది.
కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు
1. రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే నిబంధనల మేరకు ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లు నడుపుతారు. వీటి సమన్వయానికి రైల్వే శాఖ, రాష్ట్రాలు సీనియర్ ఆఫీసర్లను నోడల్ అధికారులుగా నియమించాలి.
2. ప్రయాణికులు రైలు ఎక్కే ముందు వారిని పంపించే రాష్ట్రాలు స్క్రీనింగ్ నిర్వహించాలి. కోవిడ్-19 లక్షణాలు లేవని తేలిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి.
3. శానిటైజ్ చేసిన బస్సుల్లో ప్రయాణికులను బ్యాచ్‌ల వారీగా రైల్వే స్టేషన్‌కు తీసుకురావాలి. ప్రయాణికులు ముఖానికి మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి.
4. ప్రయాణికులను పంపే రాష్ట్రమే వారికి భోజనం, తాగునీరు రైలు ఎక్కేముందు సమకూర్చాలి. ఒకవేళ ఎక్కువ దూరం ప్రయాణించాల్సివుంటే రైళ్లలోనే భోజన ఏర్పాట్లు చేస్తారు.
5. ప్రయాణికులు గమ్యానికి చేరుకున్నాక సదరు రాష్ట్ర ప్రభుత్వం వారికి స్క్రీనింగ్ చేయాలి. అవసరమనుకుంటే క్వారంటైన్‌కు తరలించాలి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా ఏర్పాట్లు చేయాలి.