Mumbai, May 1: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ పేషంట్ల కోసం ప్లాస్మా చికిత్సను ప్రయోగిస్తున్న సంగతి విదితమే. అయితే మహారాష్ట్రలో ( Maharashtra) తొలిసారిగా ప్లాస్మా చికిత్స ప్రయోగించిన 53 ఏళ్ల వ్యక్తి బుధవారం అర్థరాత్రి మరణించారు. ఈ చికిత్స ఫెయిల్ కావడంతో మరణించారని (Frist Plasma Therapy Die) ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గాంధీ ఆస్పత్రిలో ఇకనుంచి ప్లాస్మా థెరపీ, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్, 32 మంది ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేఖ
కరోనావైరస్ కారణంగా 53 ఏళ్ల వ్యక్తి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో (Lilavati Hospital) చేరగా అతనికి ప్లాస్మా చికిత్స (Plasma Therapy) అందించారు. కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన 200 మి.లీ. ప్లాస్మాను అందించి ట్రీట్‌మెంట్ కొనసాగించారు. మొదట్లో కోలుకుంటున్నట్లు అనిపించినా, తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. 24 గంటల్లోనే పరిస్థితి విషమించి ఆ వ్యక్తి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది వరకే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి ప్రకారమే ప్లాస్మా చికిత్స చేశామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌తోపే తెలిపారు. బివైఎల్ నాయర్ ఆసుపత్రిలో మరో కరోనా రోగికి ప్లాస్మా చికిత్స చేస్తున్నామని, అది విజయవంతమవుందని ఆశిస్తున్నట్లు వెల్లడించిన కొద్ది గంటల్లోనే మొదటి ప్లాస్మా చికిత్స తీసుకుంటున్న వ్యక్తి మరణించడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్లాస్మా చికిత్స ప్రయోగిస్తున్న ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సత్పలితాలు వస్తున్నాయి. కాబట్టి మరికొంత మందిపై ప్రయోగాల కోసం ఐసీఎంఆర్‌ను అనుమతి కోరిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, సానుకూల ఫలితాలను ఇస్తోన్న ప్లాస్మా చికిత్స, మీడియాకు వెల్లడించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
కాగా కోవిడ్ నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులైన వారి నుంచి ఈ ప్లాస్మాను సేకరిస్తారు. అది కూడా వారి ఇష్టప్రకారం అయితేనే 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయితేనే వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. వీటి ద్వారా కనీసం నలుగురు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.