Amaravati, May 1: లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో ( Gujarat) చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను (Telugu fishermens) ఏపీకి తరలించడంలో సహకరించినందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి(Gujarat CM Vijay Rupani), అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan Mohan Reddy) ట్వీట్ చేశారు.
అలాగే వారు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ పొడిగిస్తారా, ఎత్తేస్తారా, ఉత్కంఠ మధ్య క్యాబినెట్ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ, రేపు జాతినుద్దేశించి ప్రసగించనున్న ప్రధాని
కాగా గుజరాత్ చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకురావడానికి సీఎం వైఎస్ జగన్ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ సీఎంకు ఫోన్ చేయడమే కాకుండా పలుమార్లు వారి పరిస్థితి గురించి సమీక్ష చేపట్టారు. మత్య్సకారుల బాగోగులు పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారిని క్షేమంగా ఏపీకి తరలించేందుకు రూ. 3 కోట్లు మంజూరు చేశారు.ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేశారు.
Here's AP CM Tweet
I thank @CMOGuj @vijayrupanibjp & his team for helping us bring back the stranded fishermen home. I highly appreciate & look forward to such cooperation.#COVID19
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2020
గుజరాత్ నుంచి 12 బస్సుల్లో ఏపీకి బయలుదేరిన మత్స్యకారులు శుక్రవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి గరికపాడు చెక్ పోస్టు వద్ద విప్ సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ ఉదయభాను మత్య్సకారులకు జగ్గయ్యపేట వద్ద కిచిడీ ప్యాకెట్లు పంపిణి చేశారు. కాగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐదు చోట్ల అల్పాహార పాకెట్లు, వాటర్ బాటిళ్లను సిద్ధం చేసినట్లు మత్య్సశాఖ పేర్కొంది. 35 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం, దేశ వ్యాప్తంగా తగ్గిన రెడ్ జోన్ల సంఖ్య
చేపల వేటకు గుజరాత్‌కు వెళ్లిన ఉత్తరాంధ్రకు చెందిన 876 మంది మత్స్యకారులు లాక్‌డౌన్ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. వారంతా శుక్రవారం గుజరాత్ నుంచి తెలంగాణ మీదుగా మొత్తం 12 బస్సుల్లో విజయవాడకు చేరుకున్నారు. మత్య్సకారులు ఉన్న బస్సులు ఆగే ఐదు చోట్ల పంచాయితీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. వారంతా భౌతిక దూరం పాటించేలా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.