Lok Sabha Adjourned Sine Die: లోక్‌సభ నిరవధిక వాయిదా, ఆ పిల్లాడు కన్ను కొట్టాడంటూ రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీపై ధ్వజం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

PM Modi (Photo-ANI)

New Delhi, July 2: జులై 24న ప్రారంభమైన 18వ లోక్‌సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. తొలి సమావేశాలు వాడివేడిగా సాగాయి. ఈ సమావేశాల్లో నీట్‌ వివాదం, మణిపూర్‌ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.

ఈ సెషన్‌లో జూన్ 24, 25వ తేదీల్లో తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జరగ్గా, ఆపై ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో ప్రమాణం చేయించారు. 26వ తేదీన లోక్‌సభ నూతన స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఇక 27వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 28వ తేదీ నుంచి ఉభయ సభల సాధారణ కార్యకలాపాలు జరిగాయి. జూలై 1, 2వ తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరిగింది.

ప్రధాని మోదీ సర్కార్‌ లక్ష్యంగా విపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలను స్పీకర్‌ ఆదేశాలతో రికార్డుల నుంచి తొలగించినట్టు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించడం పెను దుమారం రేపింది. తన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని రాహుల్‌ గాంధీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. మోదీ ప్రభుత్వం విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులతో వేధింపులకు గురిచేస్తోందని రాహుల్‌ విమర్శించారు. ఎన్డీయే హయాంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.  వీడియో ఇదిగో, శివుని బొమ్మతో బీజేపీని ఏకి పారేసిన రాహుల్ గాంధీ, హింసని ప్రేరేపించే మిమ్మల్ని హిందువులని ఎలా అనగలమని సూటి ప్రశ్న

మరోవైపు విపక్షాల విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లాడి తీర్పులో ఇంకా మార్పు రాలేదని, తనని కొడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడ్చాడని ఎద్దేవా చేశారు. ఆ పిల్లాడు సభలో కన్ను కొట్టిన తీరుని అంతా చూశారని పేర్కొన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ.. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన అరాచకంగా సాగిందని మోదీ ఆరోపించారు. దేశం నలుమూలల ఆ పార్టీ విషయం చిమ్మిందని వ్యాఖ్యానించారు. భాషలు, ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. ఓబీసీ వర్గాలను కాంగ్రెస్ దొంగలుగా చిత్రీకరిస్తోందని పేర్కొన్నారు. మోదీ హిందూ స‌మాజం కాదని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, ప్రధాని మోదీ ఏమన్నారంటే..

కాంగ్రెస్ నేతల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గ్రహించారని.. అబద్ధాలతో చేసే రాజకీయాలు ఎంతోకాలం నడవవని హితవు పలికారు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలపై కూడా బురదజల్లారని మండిపడ్డారు.రాజ్యాంగం, రిజర్వేషన్లు, రఫెల్‌పైనే దుష్ప్రచారం చేశారని తూర్పారపట్టారు. ఎల్ఐసీ, బ్యాంకులు, అగ్నివీర్‌లో విషయంలోనూ అబద్ధాలు చెప్పారని నిప్పులు చెరిగారు. రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వడం లేదని అసత్య ప్రచారాలు చేశారని.. అయితే ఇలాంటి అబద్ధాల్ని ప్రజలు నమ్మరని కాంగ్రెస్ తెలుసుకోవాలని సూచించారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి.. ఆ నేతల అబద్ధాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విపక్ష నేతల ప్రవర్తన సభ హుందాతనానికి మంచిది కాదని.. చిన్న పిల్లల మనస్తత్వం వీడాలని కోరారు. సభలో ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి శోభ ఇవ్వదని చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలకు తాము నిజాలే చెప్తామన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీలు, పీడిత వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అంబేద్కర్ చెప్పారని.. నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చకే ఆయన రాజీనామా చేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు సంతోషపడుతున్నాడని.. కానీ ఆ మార్కులు 100కి కాదు, 543కి వచ్చాయని ఎద్దేవా చేశారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లు వచ్చాయని.. సున్నా సీట్లు వచ్చినా కాంగ్రెస్ వాళ్లు హీరోల్లా ఫీల్ అవుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ, కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ పోరులో కాంగ్రెస్ స్ట్రైక్‌రేట్ 26 శాతం మాత్రమేనంటూ దుయ్యబట్టారు.

లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి అసత్యాలను ప్రచారం చేసినా పరాజయం తప్పలేదని ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దశాబ్ధంలో భారత్‌ ఖ్యాతి పెరిగిందని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్‌ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని స్పష్టం చేశారు. నేషన్‌ ఫస్ట్‌ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సభలో నిన్న, ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారని, వీరిలో కొందరు తొలిసారి ఎంపీలు అయినవారు కూడా ఉన్నారని తెలిపారు.

నీట్ యూజీ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీనిచ్చారు.నీట్ అక్రమాలపై విచారణ జరపాలని విద్యాశాఖ కోరడంతో సీబీఐ రంగంలోకి దిగింది. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ సహా రాజస్థాన్, గుజరాత్‌లో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ హజారిబాగ్ ఓయాసిస్ స్కూల్‌‌లో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు.

తప్పు చేసిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు. గుజరాత్ గోధారా స్కూల్‌కు చెందిన ఓనర్ జే జలరాం, జర్నలిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలో సాయం చేస్తామని జలరాం స్కూల్ ఓనర్ అభ్యర్థుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని సీబీఐ అధికారులు వివరించారు. నీట్ పరీక్షలో తన కుమారుడు పాస్ అయ్యేందుకు ప్రయాగ్ రాజ్‌‌ నైనికి చెందిన డాక్టర్ రూ.4 లక్షలు ఇచ్చారని సీబీఐ అధికారులు గుర్తించారు. కుమారుడితో సహా వైద్యుడు పరారీలో ఉన్నారు.



సంబంధిత వార్తలు

CM Chandrababu Speech in Assembly: 2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..

Nitish Kumar Tries to Touch PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్

Putin Heaps Praise on PM Modi: ప్ర‌పంచ దేశాల్లో‌కెల్లా ఇండియానే సూప‌ర్ ప‌వ‌ర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోంద‌ని వెల్లడి